news

News December 12, 2024

మగాడికి కాస్త ఊరట: ‘మనోవర్తి’కి సుప్రీంకోర్టు సూచనలు (2)

image

* దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు * అత్తారింట్లో భార్య జీవన ప్రమాణాలేంటి? * కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె ఉద్యోగం మానేసిందా? * మనోవర్తి చెల్లిస్తున్నప్పుడు భర్త ఆర్థిక హోదా, ఆదాయం, ఇతర బాధ్యతలు ఏంటి? * ఇదేమీ సింపుల్ ఫార్ములా కానప్పటికీ మనోవర్తి నిర్ణయంలో తోడ్పడతాయని సుప్రీంకోర్టు తెలిపింది. మనోవర్తి చెల్లించాల్సిన మొత్తం ఏ భర్తకూ శిక్ష కారాదని, అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలని పేర్కొంది.

News December 12, 2024

నిఖేశ్ అక్రమార్జన రోజుకు రూ.2 లక్షలు!

image

TG: నీటిపారుదలశాఖ AEE నిఖేశ్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అక్రమార్జన రోజుకు ₹.2లక్షలకు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్‌లో చేరిన 10ఏళ్లలోనే ₹.100కోట్లు కూడబెట్టారని సమాచారం. ఒక్కో ఫైల్‌కే ఆయన ₹.50లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. FTL, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.

News December 12, 2024

హ్యాపీ బర్త్ డే మై బ్రో: హర్భజన్

image

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ బర్త్ డే కావడంతో క్రికెట్ అభిమానులు, సహచరుల ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా యువీకి హర్భజన్ సింగ్ విషెస్ తెలిపారు. ‘నా సోదరుడికి హ్యాపీ బర్త్ డే. ఈరోజు ప్రేమ, వినోదంతో నిండాలని కోరుకుంటున్నా. మీ వ్యక్తిత్వం, నెవర్ గివప్ ఆటిట్యూడ్, పాజిటివ్‌తో ఉండే మీ స్వభావం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉండండి’ అని భజ్జీ ట్వీట్ చేశారు.

News December 12, 2024

వైసీపీలో ఎవరికీ గౌరవం లేదు: అవంతి శ్రీనివాస్

image

AP: వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. YCPకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీలో ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి. అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోరు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కాకముందే ధర్నాలు చేయడమేంటి? ప్రతి విషయాన్ని ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ధర్నాలు, నిరసనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News December 12, 2024

భారత్‌ను ముక్కలు చేయాలనుకుంటున్న విదేశీ శక్తులు: ధన్‌ఖడ్

image

దేశాభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని విదేశీ శక్తులు భారత్‌ను ముక్కలు చేయాలనుకుంటున్నాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఐకమత్యంతో యాంటీ ఇండియా నెరేటివ్‌ను న్యూట్రలైజ్ చేయాలన్నారు. ‘భారత్ శక్తిసామర్థ్యాలున్న దేశమని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం వేగంగా ఎదుగుతున్నాం. దీనినెవ్వరూ అడ్డుకోలేరు’ అని చెప్పారు.

News December 12, 2024

వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా

image

AP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ YCPని వీడారు. ఆ పార్టీ సభ్యత్వంతో పాటు భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జగన్ హయాంలో అవంతి పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో YCP అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే రాజీనామా ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

News December 12, 2024

లవర్స్ మిస్సింగ్!

image

TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో లక్ష మందికి పైగా అదృశ్యమైతే అందులో సుమారు 60వేల మంది ప్రేమికులే ఉన్నట్లు క్రైం రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 17-28 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. 85% మందిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని పేరెంట్స్‌కు అప్పగిస్తున్నారు. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే వీరు గడప దాటుతున్నట్లు పోలీసుల కౌన్సెలింగ్‌లో తేలింది. మరోవైపు మిగతా 15% మంది ఆచూకీ మిస్టరీగా మారుతోంది.

News December 12, 2024

STOCK MARKETS: ఎయిర్‌టెల్, టీసీఎస్‌ షేర్లకు డిమాండ్

image

స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 24,664 (+24), సెన్సెక్స్ 81,646 (+124) వద్ద ట్రేడవుతున్నాయి. IT, సర్వీస్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు షేర్లకు డిమాండ్ నెలకొంది. మీడియా, టూరిజం, ఆటో, కన్జూమర్ డ్యురబుల్స్, ఎనర్జీ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. TECHM, AIRTEL, TCS, INDUSIND, WIPRO టాప్ గెయినర్స్. టైటాన్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, మారుతీ టాప్ లూజర్స్. IND VIX 13కు తగ్గింది.

News December 12, 2024

‘ప్లేయర్ ఆఫ్ ద మంత్‌’గా పాక్ క్రికెటర్

image

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్‌’గా పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఎంపికయ్యారు. నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఐసీసీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మార్కో జాన్సెన్ కూడా ఈ అవార్డుకు పోటీపడ్డారు. కాగా గత నెలలో రవూఫ్ ఒక ఐదు వికెట్ల ప్రదర్శనతోపాటు మొత్తం 18 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆయన అద్భుతంగా రాణించారు.

News December 12, 2024

బౌన్సర్లు ఎవరిపైనైనా దాడులు చేయొచ్చా?

image

ప్రస్తుతం బౌన్సర్ల వినియోగం పెరిగిపోతోంది. హోటళ్లు, పబ్బులు, మాల్స్, ఈవెంట్లలో జనాన్ని అదుపు చేసేందుకు వీరిని ఉపయోగిస్తుంటారు. కొందరు బౌన్సర్లు భద్రత పేరుతో అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తున్నారు. పస్రా చట్టం ప్రకారం ఇతరులపై దాడులు చేయడానికి వీరికి హక్కు లేదు. వారు దాడి చేస్తే కేసు పెట్టొచ్చు. బౌన్సర్లకు కచ్చితంగా PSLN నంబర్, కోడ్ ఉండాలి. బౌన్సర్ల వ్యవస్థ ఉండాలా వద్దా అనేదానిపై మీ కామెంట్.