news

News December 12, 2024

త్వరలో RTC బస్సుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు

image

TG: రాష్ట్రంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య త్వరలోనే ‘చిల్లర’ సమస్యలు తీరనున్నాయి. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ల కోసం RTC ఏర్పాట్లు సిద్ధం చేయగా, తొలుత HYDలో పరిశీలించనుంది. ఆపై రాష్ట్రమంతటా వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సంస్థ చేతికి 6 వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు అందాయి. ప్రస్తుతం దూరప్రాంత రూట్లలోనే ఉండగా, త్వరలో ఇవి పల్లెవెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లోనూ ఉపయోగించనున్నారు.

News December 12, 2024

రాహుల్.. ఫోన్ బ్యాంకింగ్ బాగోతం గుర్తులేదా: నిర్మలా సీతారామన్

image

ప్రభుత్వ బ్యాంకులను కాంగ్రెస్ ATMsగా ట్రీట్ చేసిందని FM నిర్మల అన్నారు. ‘ఫోన్ బ్యాంకింగ్’తో ఉద్యోగులను ఒత్తిడిచేసి తమ క్రోనీస్‌కు లోన్లు మంజూరు చేయించిందన్నారు. ‘2015లో మేం చేపట్టిన సమీక్షలో ఫోన్ బ్యాంకింగ్ బాగోతం బయటపడింది. NPAలతో గడ్డకట్టుకుపోయిన బ్యాంకింగ్ వ్యవస్థను నిధులిచ్చి మోదీ ప్రభుత్వమే కాపాడింద’న్నారు. సంపన్నులకు PSBలు ప్రైవేటు ఫైనాన్షియర్లుగా మారాయన్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.

News December 12, 2024

నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News December 12, 2024

కాసేపట్లో అవంతి ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన చేసే అవకాశం!

image

AP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆయన YCP కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో అవంతి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News December 12, 2024

తీవ్ర విషాదం.. 55 గంటలు కష్టపడినా!

image

రాజస్థాన్ దౌసాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి మృతిచెందాడు. 55 గంటల పాటు పొక్లెయిన్లతో బాలుడిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన శ్రమ వృథా అయింది. చిన్నారిని వెలికితీసి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. బాలుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. గాయాలు, ఆక్సిజన్ కొరత వల్ల బాలుడు మృతి చెందాడని చెప్పారు.

News December 12, 2024

‘పుష్ప2’ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ

image

‘పుష్ప2’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలకు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆయన అన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు ఎప్పుడూ మంచి జరగాలి. కళాకారుల శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. నాకు అల్లు అర్జున్‌తో శత్రుత్వమేమీ లేదు. నేను ఎవరినీ వ్యక్తిగతంగా కానీ, ఏదో సినిమాపై కానీ ఆ వ్యాఖ్యలు చేయలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News December 12, 2024

బిగ్‌బాస్-8 గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్?

image

బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది. పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ మెగా ఈవెంట్‌కు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విన్నర్‌కు ఆయనే ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది. ఇవాళో, రేపో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు టాప్-5 ఫైనలిస్ట్స్‌లో అవినాశ్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్ ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారని మీరనుకుంటున్నారు?

News December 12, 2024

BITCOIN: 24 గంటల్లో ₹3.82 లక్షల ప్రాఫిట్

image

క్రిప్టోమార్కెట్లు నిన్న జోరుప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ $4500 (Rs 3.82L) లాభపడింది. మళ్లీ $1,01,125 వద్ద ముగిసింది. నేడు మాత్రం $450 నష్టంతో $1,00,676 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ విలువ $2.02Tను టచ్ చేసింది. ఇక డామినెన్స్ 55%గా ఉంది. గత 24 గంటల్లో ETH 6, XRP 5, SOL 6, BNB 7, DOGE 8, ADA 10, TRON 7, AVAX 12, SHIB 9% మేర పెరగడం విశేషం.

News December 12, 2024

‘పుష్ప-2’: రేవతి మృతికి బాధ్యులెవరు?

image

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో <<14796361>>రేవతి<<>> చనిపోగా ఆమె కొడుకు గాయపడిన విషయం తెలిసిందే. రేవతి మృతితో తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం అల్లు అర్జున్ కూడా ఇదే కారణం చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం తను వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందనడం సరికాదని, తనపై కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరి ఈ ఘటనకు బాధ్యులెవరు?

News December 12, 2024

మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు

image

నటుడు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. TV9 రిపోర్టర్‌పై దాడి చేసినందుకు నిన్న ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్‌బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.