India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: నవంబర్ 12, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:12 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
✒ తేది: నవంబర్ 12, మంగళవారం
✒ ఏకాదశి: సాయంత్రం 04.05 గంటలకు
✒ పూర్వాభాద్ర: ఉ.07.52 గంటలకు
✒ ఉత్తరాభాద్ర: తె.05.40 గంటలకు
✒ వర్జ్యం: సా.04.35-06.02 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.08.27-09.12 గంటల వరకు, రా.10.35-11.26
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
☞ రూ.2.94లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
☞ టాటా గ్రూప్ ఛైర్మన్‌తో CM CBN భేటీ.. పెట్టుబడులకు ఓకే
☞ ప్రశ్నిస్తామన్న భయంతోనే YCPకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: జగన్
☞ రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: TG CM రేవంత్
☞ ఢిల్లీకి KTR.. అమృత్ పథకంలో అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు
☞ TGలో 13 మంది IASల బదిలీ
☞ మణిపుర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మిలిటెంట్లు హతం
‘మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడింది’ అంటూ వచ్చే మెసేజ్‌లు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దని ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి స్పామ్ మెసేజ్‌లను క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేయకుండా రాహుల్ వ్యాఖ్యలను సెన్సార్ చేయాలని ECని BJP కోరింది. ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడుతూ MH అవకాశాలను ఇతర రాష్ట్రాలు దోచుకుంటున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అత్యధిక FDIలు MHకే దక్కాయని BJP నేతలు గుర్తు చేస్తున్నారు.
AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
2011లో డాలర్‌తో పోలిస్తే ₹44గా ఉన్న రూపాయి విలువ సోమవారం జీవితకాల కనిష్ఠానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి డిప్రిసియేషన్ ₹84.38కి చేరి 48% విలువ తగ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి FIIల డిజిన్వెస్ట్‌మెంట్, కంపెనీల Q2 ఫలితాలు మెప్పించకపోవడం, ట్రంప్ గెలుపుతో డాలర్ మరింత బలపడే అవకాశం ఉండడంతో రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఝార్ఖండ్‌లో 1st ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్ని BJP ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కోల్హాన్ ప్రాంతంలో తిరిగి పట్టు కోసం టైగర్ ఆఫ్ కోల్హాన్‌గా ప్రసిద్ధికెక్కిన EX CM చంపై సోరెన్‌పై ఆశలు పెట్టుకుంది. Nov 13న 43 స్థానాలకు జరుగుతున్న 1st ఫేజ్ ఎన్నికల్లో 20 ST, 6 SC స్థానాలున్నాయి. ఇక్కడ గెలుపు కోసం బంగ్లా నుంచి జరిగే అక్రమ చొరబాట్లకు ఆదివాసీల సమస్యల్ని ముడిపెట్టి వ్యూహాత్మక రాజకీయం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20న సా.5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, TGPSC నియమావళి-2014 ప్రకారం అభ్యర్థులు అర్హతలు కలిగి ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనుంది.
Sorry, no posts matched your criteria.