news

News November 11, 2024

ALERT: 3 రోజులు భారీ వర్షాలు

image

AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDM తెలిపింది. రేపు ఈ <<14585013>>జిల్లాల్లో<<>> వర్షాలు కురవనుండగా ఎల్లుండి అల్లూరి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూల్, నంద్యాలలో వానలు పడతాయని పేర్కొంది. 14న కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.

News November 11, 2024

ఏపీలో బీసీ కులాలపై ప్రభుత్వం ప్రకటన

image

AP: రాష్ట్రంలో మొత్తం 138 బీసీ కులాలు ఉన్నాయని, వీటిని 5 గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. BC-Aలో 51, BC-Bలో 27 కులాలు, BC-Cలో ఒక కులం, BC-Dలో 45, BC-Eలో 14 కులాలు ఉన్నట్లు తెలిపింది. క్రిస్టియన్లుగా మతం మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వారు BC-Cలోకి వస్తారని, ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని BC-Eలుగా గుర్తించినట్లు పేర్కొంది.

News November 11, 2024

నటితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తెలుగు డైరెక్టర్

image

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇవాళ వీరి నిశ్చితార్థం జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. సందీప్ రాజ్ ‘కలర్ ఫోటో’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

News November 11, 2024

వాటర్ వేస్టేజ్ తగ్గించేలా..!

image

రంగుల బట్టలని తయారుచేసేందుకు ఎంత నీటి కాలుష్యం జరుగుతుందో ప్రజలు పట్టించుకోవట్లేదని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(USA) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా బట్టలకు రంగు అద్దడానికి 5 ట్రిలియన్ లీటర్ల నీటిని వాడుతున్నారని తెలిపింది. కాగా, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు హీట్‌లెస్ డై ప్రక్రియను అభివృద్ధి చేశామని, దీని ద్వారా 90శాతం కాలుష్యాన్ని తగ్గించవచ్చని చైనాకు చెందిన NTX అనే కంపెనీ వెల్లడించింది.

News November 11, 2024

హలో.. మినిస్ట్రీ ఆఫ్ సెక్స్‌!

image

ర‌ష్యాలో ఇక సంతానోత్ప‌త్తి స‌మ‌స్య ఉంటే అక్క‌డి ప్ర‌జ‌లు ఇలా ఫోన్ చేస్తారేమో! ఎందుకంటే జ‌న‌నాల రేటు పెంచేందుకు Ministry of Sex (ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ‌) ఏర్పాటుకు అక్కడి ప్ర‌భుత్వం యోచిస్తోంది. భాగస్వాముల ఏకాంతాన్ని ప్రోత్సహించేలా రాత్రి 10 నుంచి 2 వ‌ర‌కు ఇంట‌ర్నెట్, క‌రెంట్ కోత; మొద‌టి డేట్‌కు వెళ్లే వారికి ₹4,300; పెళ్లి రోజు హోటల్‌లో ఉంటే ప‌బ్లిక్ ఫండ్స్ కింద ₹22,618 సాయం ఇవ్వాలని చూస్తోంది.

News November 11, 2024

ఆ డొమైన్ ఫ్రీగా ఇస్తాం: దుబాయ్ యూట్యూబర్లు

image

JioHotstar డొమైన్‌ను ఢిల్లీ యాప్ డెవలపర్ నుంచి దుబాయ్‌కు చెందిన ఇద్దరు యూట్యూబర్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సైట్‌ను రిలయన్స్‌కు ఇవ్వాలంటే రూ.కోటి చెల్లించాలని గతంలో వీరు డిమాండ్ చేశారు. అయితే, తాజాగా ఫ్రీగా ఇస్తామంటూ ట్విస్ట్ ఇచ్చారు. jiohotstar.com డొమైన్ వారి దగ్గర ఉండటమే ఉత్తమమని భావిస్తున్నామని, అందుకే ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వారు కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చారు.

News November 11, 2024

మరోసారి థియేటర్లలోకి ‘పుష్ప’ పార్ట్-1

image

‘పుష్ప’ పార్ట్-1ను USAలో ఈనెల 19న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. పార్ట్-1ను ఇండియాలో కూడా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘పుష్ప2-ది రూల్’ వచ్చే నెల 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News November 11, 2024

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ

image

* GHMC కమిషనర్ -ఇలంబరితి
* టూరిజం, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి -స్మిత
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ -సృజన
* ఇంటర్ బోర్డు కార్యదర్శి -కృష్ణ ఆదిత్య
* BC సంక్షేమ శాఖ కార్యదర్శి -ఇ.శ్రీధర్
* మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి -అనితా రామచంద్రన్
* రవాణా శాఖ కమిషనర్ -సురేంద్ర మోహన్
* ఎక్సైజ్ శాఖ డైరెక్టర్- హరికిరణ్
* ట్రాన్స్ కో CMD-కృష్ణ భాస్కర్

News November 11, 2024

అక్షయ్ ఫ్యాన్స్‌ పేరిట ట్రోలింగ్.. ప్రియాంకా చతుర్వేది కౌంటర్

image

BJPపై శివ‌సేన UBT MP ప్రియాంకా చ‌తుర్వేది ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు సంధించారు. కాంగ్రెస్ ప్ర‌చారంలో BJPపై న‌టుడు రితేశ్ దేశ్‌ముఖ్ చేసిన విమ‌ర్శ‌ల్ని ప్రియాంక స‌మ‌ర్థించారు. దీంతో న‌టుడు అక్ష‌య్ కుమార్ ఫ్యాన్స్ పేజీ తనను విమర్శిస్తూ పోస్టులు పెట్టిందని ప్రియాంక పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులు, హ్యాష్‌ట్యాగులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్న‌ది సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చంటూ BJPని ఆమె ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

News November 11, 2024

వయనాడ్‌‌లో మైకులు బంద్.. 13న ఉపఎన్నిక

image

వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానానికి జ‌రుగుతున్న ఉపఎన్నిక‌లో పార్టీల ప్ర‌చార ప‌ర్వానికి నేటి సాయంత్రంతో తెర‌ప‌డింది. బుధ‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. చివ‌రి రోజు UDF అభ్యర్థి, సోద‌రి ప్రియాంక‌తో క‌లిసి రాహుల్ గాంధీ సుల్తాన్ బ‌తెరిలో ప్రచారం చేశారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రియాంకకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అటు LDF నుంచి స‌త్యం మోకెరి, NDA నుంచి న‌వ్య హ‌రిదాస్ బ‌రిలో ఉన్నారు.