India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజులు, యోధుల విగ్రహాలు చూసినప్పుడు వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. ముఖ్యంగా గుర్రంపై యోధులు ఉన్న విగ్రహాలను బట్టి మరణానికి గల కారణాలు చెప్పొచ్చని పురాణ పండితులు చెబుతున్నారు. ‘విగ్రహంలోని గుర్రం రెండు కాళ్లు పైకి లేపి ఉంచితే యుద్ధభూమిలో చనిపోయినట్టు. ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచితే యుద్ధంలో గాయపడి తర్వాత మరణించినట్లు గుర్తు. ఇక రెండు కాళ్లు భూమిపై ఉంటే అనారోగ్యంతో చనిపోయినట్లు’ అని ప్రతీతి.
TG:సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14వ తేదీన మంత్రులు, MLAలు, MLCలు, MPలు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులూ పాల్గొనాలని కోరారు. అటు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను తనిఖీ చేసి, సరుకుల క్వాలిటీ, క్వాంటిటీపై దృష్టి సారించాలని ఆదేశించారు.
న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.2025తో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో 200 రోజుల పాటు రోజుకు 2.5GB ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMSలు చేసుకోవచ్చు. దీనికి తోడుగా రూ.2150 విలువైన(రూ.500 అజియో, ఈజ్ మై ట్రిప్ రూ.1500, స్విగ్గీ రూ.150) కూపన్లను అందిస్తోంది. డిసెంబర్ 11 నుంచి జనవరి 11, 2025 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది.
‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టి ఈ ఘనత సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘దంగల్’. IMDb ప్రకారం ఈ చిత్రానికి రూ.2024 కోట్లు వచ్చాయి. దీని తర్వాత బాహుబలి-2(రూ.1742 కోట్లు), RRR(రూ.1250.9 కోట్లు), KGF-2 (రూ.1176 కోట్లు), జవాన్ (రూ.1157 కోట్లు), పఠాన్(రూ.1042 కోట్లు), కల్కి (రూ.1019 కోట్లు) ఉన్నాయి.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 103 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో శతకం నమోదు చేశారు. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ODIల్లో నాలుగు సెంచరీలు చేసిన మహిళా ప్లేయర్‌గా నిలిచారు. వన్డేల్లో ఈ ప్లేయర్‌కు ఇది తొమ్మిదో సెంచరీ.
APలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఐటీని అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రతినిధులు వెల్లడించారు. గూగుల్ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, ఈ ఒప్పందం వల్ల దేశ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. గూగుల్‌కు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన అన్నారు.
TG: రాష్ట్రంలో సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన 20 మందికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. సింగరేణి సహకారంతో ప్రభుత్వ ఆర్థిక సాయం అందుకొని సివిల్స్ ప్రధాన పరీక్షల్లో రాణించడం తమకు గర్వకారణమని తెలిపారు. ఒక చిరు దీపం కొండంత వెలుగును ఇస్తుందని, ప్రభుత్వ చిరు సాయం గొప్ప ఫలితాలను అందించిందని పేర్కొన్నారు.
TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తులను పక్కాగా పరిశీలించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ‘ఈ నెల 31లోపు పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి 500 మందికి ఒక సర్వేయర్‌ను నియమించుకోవాలి. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు వేయాలి. ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.
AP: బియ్యం స్మగ్లింగ్ వంటి అక్రమ చర్యలను నియంత్రించేందుకు అవసరమైతే పీడీ యాక్టును వాడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు సొమ్మును 24 గంటల్లోపే రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ రైస్ తినని వారికి ప్రత్యామ్నాయం చూసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సినిమా నుంచి మంచి నేర్చుకోవడం కంటే, చెడు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గ్వాలియర్‌లోని(MP) కాజల్ టాకీస్‌లో ‘పుష్ప-2’ సినిమా చూసేందుకు వచ్చిన షబ్బీర్‌తో క్యాంటిన్ సిబ్బంది గొడవకు దిగారు. వాగ్వాదం పెరగడంతో సినిమాలో అల్లు అర్జున్ ఫైటింగ్ చేస్తూ ప్రత్యర్థుల చెవిని కొరికినట్లు.. షబ్బీర్ చెవిని ఒకరు కొరికేశాడు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.