India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

RBI రెపోరేటు తగ్గించాక చాలామందిలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇది కేవలం హోమ్‌లోన్‌కు మాత్రమే వర్తిస్తుందా? పర్సనల్, ఆటో లోన్లకు వర్తించదా? అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అనే 2 రకాల వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఫ్లోటింగ్ రేటుకే మీరు లోన్ తీసుకొని ఉంటే రెపోరేటు మార్పులను బట్టి EMI పెరగడం, తగ్గడం ఉంటుంది. హోమ్, పర్సనల్, ఆటో లోన్లకూ వర్తిస్తుంది.

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వీరందరూ ఫెయిల్ కావడంతోనే ఇంటికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా నిర్వహించారని ఉద్యోగులు వాపోతున్నారు.

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

మన దగ్గర ఎక్కువ మంది కలలో పాము కనిపించిందని చెప్తుంటారు. అయితే, దేశాలను బట్టి వారి డ్రీమ్స్‌లో వచ్చేవి కూడా మారుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అర్జెంటీనాలో ఎక్కువ మందికి స్పైడర్స్, AUS & కెనడా వారికి పళ్లు ఊడిపోయినట్లు, బంగ్లాదేశ్ ప్రజలకు పెళ్లి జరిగినట్లు కలలొస్తాయి. ఫ్రాన్స్ ప్రజలకు తమ మాజీ గర్ల్‌ఫ్రెండ్ డ్రీమ్స్‌లోకి వస్తుందని చెప్పారు. బ్రెజిల్ & ఆస్ట్రియా వాళ్ల డ్రీమ్స్‌లో మోస్ట్ కామన్ పామే.

పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(PFF)ను ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(FIFA) సస్పెండ్ చేసింది. నిబంధనలను పాటించడంలో విఫలమైందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. PFFలో సజావుగా ఎన్నికల నిర్వహణ, గ్రూపిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 2019లో నార్మలైజేషన్ కమిటీని ఫిఫా ఏర్పాటు చేసింది. కానీ సత్ఫలితాలు రాలేదు. దీంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుంచి PFF సస్పెన్షన్‌కు గురికావడం ఇది మూడోసారి.

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ చీఫ్ యూరీ బొరిసోవ్‌ను పుతిన్ తొలగించారు. అతడి స్థానంలో డిప్యూటీ రవాణామంత్రి దిమిత్రీ బకనోవ్‌ను నియమించారు. 2022 జులై నుంచి యూరీ రాస్‌కాస్మోస్ చీఫ్‌గా ఉన్నారు. ఆయన హయాంలోనే 2023లో చంద్రుడిపైకి పంపిన లూనా-25 మిషన్ విఫలమై చంద్రుడి ఉపరితలంపై పడిపోయింది. రోదసి పరిశోధనల్లో సంస్థ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండటమే తొలగింపు వెనుక కారణమని తెలుస్తోంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇప్పటికే విశ్వక్‌తో పాటు ‘లైలా’ నిర్మాత చిరును కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు.

AP: గుండెపోటుకు గురైన పేషంట్ ప్రాణం నిలిపేందుకు మొదటి గంటలోపే ‘టెనెక్టెప్లేస్-40’ అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ ట్వీట్ చేసింది. రూ.40 వేల నుంచి రూ.45 వేల విలువైన ఈ టీకాను పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉందని తెలిపింది.

సినీ, క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మొదలు కానుంది. రేపు తెలుగు వారియర్స్‌కు, కర్ణాటక బుల్డోజర్స్‌కు మధ్య బెంగళూరులో సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ జరగనుంది. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రైనోస్ vs బెంగాల్ టైగర్స్ మ్యాచ్ జరగనుంది. కాగా 14, 15వ తేదీల్లో హైదరాబాద్‌లో నాలుగు మ్యాచులున్నాయి. రేపు జరిగే మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

TG: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఐదుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.