News February 7, 2025

పర్సనల్, ఆటో లోన్లకు రెపోరేటు తగ్గింపు వర్తించదా?

image

RBI రెపోరేటు తగ్గించాక చాలామందిలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇది కేవలం హోమ్‌లోన్‌కు మాత్రమే వర్తిస్తుందా? పర్సనల్, ఆటో లోన్లకు వర్తించదా? అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అనే 2 రకాల వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఫ్లోటింగ్ రేటుకే మీరు లోన్ తీసుకొని ఉంటే రెపోరేటు మార్పులను బట్టి EMI పెరగడం, తగ్గడం ఉంటుంది. హోమ్, పర్సనల్, ఆటో లోన్లకూ వర్తిస్తుంది.

Similar News

News March 23, 2025

YELLOW ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, HYD తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

News March 23, 2025

మొబైల్ కొనేటప్పుడు ఇది చూస్తున్నారా?

image

ప్రస్తుతం ఫోన్ కొనేటప్పుడు అందరూ అంటుటు (anTuTu) స్కోర్ చూస్తున్నారు. ఫోన్ స్పీడ్, గ్రాఫిక్స్, ర్యామ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటివాటిని పరిశీలించి ఒక నంబర్ ఇస్తారు. దీనినే అంటుటు అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ అంత పవర్‌ఫుల్ అని అర్థం. ఎలాంటి గేమ్స్ ఆడినా ఫోన్‌ హ్యాంగ్ కాదు. ప్రస్తుతం ఐకూ13 మొబైల్‌ 26,98,668 స్కోర్‌తో టాప్‌లో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో ఫోన్ 26,66,229తో సెకండ్ ప్లేస్‌లో ఉంది.

News March 23, 2025

పంట నష్టం అంచనా వేయండి: అచ్చెన్న

image

AP: రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వానపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించాలని, నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అలాగే అన్నదాతలకు అందుబాటులో ఉంటూ తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!