India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో చైనా ప్లేయర్ హీ బింగ్‌జియావో రజత పతకం గెలిచారు. అయితే, తన ప్రదర్శనతో మెడల్ సాధించిన ఆమె క్రీడాస్ఫూర్తిని చాటి అభిమానుల మనసులను దోచేశారు. కాగా సెమీస్‌లో హీ ప్రత్యర్థి కరోలినా మోకాలి గాయం కారణంగా వైదొలగడంతో ఆమె ఫైనల్ చేరారు. దీంతో నేటి ఫైనల్ తర్వాత మెడల్ తీసుకునే సమయంలో ఆమె స్పానిష్ జెండా బ్యాడ్జి పట్టుకుని మద్దతు తెలిపారు.
AP: టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆగస్టు 3తో దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 4,27,300 మంది అప్లై చేసుకున్నట్లు పేర్కొంది. డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా, డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
చివరి 2 సెషన్లలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ సూచీలు విలవిల్లాడాయి. జపాన్ నిక్కీ ఏకంగా 26% పతనమై బేర్స్ పట్టులోకి వెళ్లింది. భారత నిఫ్టీ కేవలం 4% తగ్గి బలం చాటింది. మిగతా సూచీలు పనితీరు ఇదీ..
* కొరియా కాస్పీ కాంపోజిట్ (16%)
* హాంకాంగ్ హాంగ్ సెంగ్ (14%)
* ఫ్రెంచ్ CAC 40 (14%)
* చైనా షాంఘై కాంపోజిట్ (13%)
* US నాస్‌డాక్, DAX (చెరో 9%)
* S&P 500 (6%)
* బ్రిటిష్ FTSE (5%)
నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం 2024 అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. 2024 ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు పాస్ అయిన వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చంది. దీంతో పాటు ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు కూడా తమ అప్లికేషన్లను రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపింది. scholarship.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా తిరిగి రాజకీయాల్లోకి రావొద్దని నిర్ణయించుకున్నట్లు ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బీబీసీకి తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు కష్టపడి పనిచేసినా మైనారిటీ వర్గం వ్యతిరేకంగా నిరసించడంతో ఆమె చాలా నిరాశకు గురయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రికి సలహాదారుగా ఉన్నారు. హసీనా ఇండియా నుంచి లండన్‌కు వెళ్తున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారిక నివాసంలో నిరసనకారులు ప్రవర్తించిన తీరుపై విమర్శలొస్తున్నాయి. ఆమె దుస్తులను దొంగలించిన యువకులు.. లోదుస్తులు, జాకెట్లను ఎత్తుకెళ్తూ కెమెరాలకు పోజులిచ్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అక్కడ పెంచుతున్న కోళ్లు, ఇతర మూగజీవాలను సైతం తస్కరించారు. రిజర్వేషన్లపై నిరసన చేసేవారు ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడో తెలిపే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9వ తేదీన సినిమా అధికారికంగా లాంచ్ అవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు ‘వార్-2’లో నటిస్తున్నారు.
TG: యూఎస్ఏలో కాగ్నిజెంట్ టీమ్‌తో చర్చలు విజయవంతంగా ముగిశాయని సీఎం రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ఏర్పాటుకు ఆ సంస్థ ఒప్పుకుందని తెలిపారు. ఈ కొత్త బ్రాంచీతో 15వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని టైర్-2 సిటీల్లోనూ కంపెనీని విస్తరించాలన్న తన సూచనకు ఆ సంస్థ సీఈవో రవికుమార్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
NSA అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. హిండన్ ఎయిర్‌బేస్‌లో షేక్ హసీనాను కలిశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఆమె భవిష్యత్తు ప్రణాళికను అడిగి తెలుసుకున్నారని సమాచారం. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఆమెకు భారత ఎయిర్‌ఫోర్స్, ఇతర ఏజెన్సీలు భద్రత కల్పిస్తున్నాయి. అల్లర్ల నేపథ్యంలో IAF అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. తూర్పు సెక్టార్లో నిఘా పెంచింది. అలాగే బంగ్లా బోర్డర్ గార్డ్స్‌తో BSF టచ్‌లో ఉంది.
బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో సా.6 నుంచి ఉ.6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రెస్‌టోన్ టిన్‌సాంగ్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌తో మేఘాలయ 442 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దీంతో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.
Sorry, no posts matched your criteria.