news

News August 5, 2024

మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్

image

మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ అడవిలో చెట్టుకు కట్టేసి కనిపించిన US మహిళ <<13735658>>ఘటనలో<<>> బిగ్ ట్విట్ చోటు చేసుకుంది. తనను చెట్టుకు కట్టేయడంలో ఎవరి ప్రమేయం లేదని, తానే అలా చేసుకున్నట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న తనకు భర్త కూడా లేడని తెలిపారు. ఇటీవల అడవిలో ఆకలితో అలమటిస్తూ కనిపించిన మహిళను పోలీసులు సేవ్ చేశారు. తనను భర్తే చెట్టుకు కట్టేసి వెళ్లాడని ఆమె అప్పుడు చెప్పారు.

News August 5, 2024

ఘరానా మోసగాడు.. ఎట్టకేలకు అరెస్టయ్యాడు

image

చలపతిరావు HYDలోని ఓ SBI బ్రాంచిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసేవాడు. ఫేక్ పేపర్లతో తన బంధువులకు ₹50లక్షలు లోన్ ఇప్పించాడు. 2004లో అతడిపై ఛార్జిషీట్ దాఖలైంది. దీంతో ప్లాన్ వేసి భార్యతో ‘భర్త కనిపించడం లేదు. చనిపోయినట్లు ప్రకటించండి’ అని పిటిషన్ వేయించగా కోర్టు ఆమేరకు ఉత్తర్వులిచ్చింది. అతడేమో వేషాలు, పేర్లు మార్చుకొని తిరుగుతున్నాడు. జీమెయిల్, Ph నం. ఆధారంగా అతడిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు.

News August 5, 2024

అన్ని లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తెస్తాం: సీఎం

image

AP: రాష్ట్రంలో త్వరలో కొత్త లిక్కర్ పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని తెలిపారు. అన్ని లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇలా చేస్తే మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

News August 5, 2024

తప్పు చేసిన వారిని వదిలిపెట్టం: చంద్రబాబు

image

AP: ప్రభుత్వంపై చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అధికారులకు CM చంద్రబాబు సూచించారు. ‘మేం ఎవరినీ రాజకీయ బాధితులను చేయం. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టం. 36 మందిని చంపేశారని YCP నేతలు ఢిల్లీలో ధర్నా చేశారు. మృతుల వివరాలు, FIR కాపీలు ఇవ్వమంటే ఇవ్వలేదు. పొలిటీషియన్లు పేపర్, టీవీలు పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు’ అని వ్యాఖ్యానించారు.

News August 5, 2024

సంక్షోభంలోకి జపాన్ ఎకానమీ.. టచ్ చేస్తే బద్దలే

image

జపాన్ ఎకానమీ పరిస్థితి దారుణంగా తయారైంది. 15 ఏళ్ల తర్వాత జీరో వడ్డీరేటును ద్రవ్యోల్బణం కట్టడి కోసం 0.25%కు పెంచారు. అంతే $20 ట్రిలియన్ల యెన్ క్యారీట్రేడ్స్ కుప్పకూలి సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. తక్కువ ఖర్చయ్యే ఒక దేశ కరెన్సీని అప్పుగా తీసుకొని ఎక్కువ వడ్డీ ఇచ్చే ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయడాన్నే క్యారీ ట్రేడ్ అంటారు. యెన్‌పై వడ్డీపెంపు జపాన్‌ సహా మిగతా దేశాలపై చైన్ రియాక్షన్ చూపనుంది.

News August 5, 2024

ప్రధాని మోదీని కలిసిన AP BJP చీఫ్

image

AP BJP చీఫ్ పురందీశ్వరి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు. స్టీల్ ప్లాంట్‌, ఇతర సమస్యలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయనకు వివరించామన్నారు. గత ప్రభుత్వాల దుష్పరిపాలన వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో కూడా చెప్పామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపామని ఆమె పేర్కొన్నారు.

News August 5, 2024

మెడల్‌తో పాటు మనసులూ గెలిచింది!

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌లో చైనా ప్లేయర్ హీ బింగ్‌జియావో రజత పతకం గెలిచారు. అయితే, తన ప్రదర్శనతో మెడల్ సాధించిన ఆమె క్రీడాస్ఫూర్తిని చాటి అభిమానుల మనసులను దోచేశారు. కాగా సెమీస్‌లో హీ ప్రత్యర్థి కరోలినా మోకాలి గాయం కారణంగా వైదొలగడంతో ఆమె ఫైనల్‌ చేరారు. దీంతో నేటి ఫైనల్ తర్వాత మెడల్ తీసుకునే సమయంలో ఆమె స్పానిష్ జెండా బ్యాడ్జి పట్టుకుని మద్దతు తెలిపారు.

News August 5, 2024

షెడ్యూల్ ప్రకారమే టెట్ పరీక్షలు: పాఠశాల విద్యాశాఖ

image

AP: టెట్ పరీక్షలు గతంలో నిర్ణయించినట్లుగానే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆగస్టు 3తో దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 4,27,300 మంది అప్లై చేసుకున్నట్లు పేర్కొంది. డీఎస్సీ ద్వారా ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుండగా, డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

News August 5, 2024

జపాన్ నిక్కీ 26% డౌన్.. మన నిఫ్టీ జస్ట్ 4%

image

చివరి 2 సెషన్లలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ సూచీలు విలవిల్లాడాయి. జపాన్ నిక్కీ ఏకంగా 26% పతనమై బేర్స్ పట్టులోకి వెళ్లింది. భారత నిఫ్టీ కేవలం 4% తగ్గి బలం చాటింది. మిగతా సూచీలు పనితీరు ఇదీ..
* కొరియా కాస్పీ కాంపోజిట్ (16%)
* హాంకాంగ్ హాంగ్ సెంగ్ (14%)
* ఫ్రెంచ్ CAC 40 (14%)
* చైనా షాంఘై కాంపోజిట్ (13%)
* US నాస్‌డాక్, DAX (చెరో 9%)
* S&P 500 (6%)
* బ్రిటిష్ FTSE (5%)

News August 5, 2024

ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థులకు అలర్ట్

image

నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం 2024 అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. 2024 ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు పాస్ అయిన వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చంది. దీంతో పాటు ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు కూడా తమ అప్లికేషన్లను రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపింది. scholarship.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.