News February 7, 2025
ఢిల్లీ దంగల్: AAP, BJP పోటాపోటీ మీటింగ్స్

ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో రాజకీయ వాతావరణం సీరియస్‌గా మారింది. నువ్వానేనా అన్నట్టుగా పోటీపడిన రెండు ప్రధాన పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. BJP ఎరవేస్తోందంటూ ఆరోపించిన ఆప్ 70 మంది అభ్యర్థులను పార్టీ ఆఫీస్‌కు పిలిపించింది. మరోవైపు ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లతో BJP కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఫలితాలు, ఆ తర్వాతి పరిణామాలపై రెండు పార్టీలూ చర్చిస్తున్నట్టు తెలిసింది.
Similar News
News March 19, 2025
మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఇందులో జక్కన్న వర్కింగ్ టైటిల్‌ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.
News March 19, 2025
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్‌లోని ఝులసన్ గ్రామం. 1957లో M.D. పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో పని చేశారు. స్లోవేనియన్-అమెరికన్ అయిన ఉర్సులిన్ బోనీ జలోకర్‌ను పెళ్లి చేసుకున్నారు. సునీత నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జె.విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.
News March 19, 2025
సునీత గురించి ఈ విషయాలు తెలుసా?

సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్‌గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్‌లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.