news

News December 11, 2024

30 మందిని కాపాడి ఏపీ జవాన్ వీరమరణం

image

AP: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్‌ఓసీ వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను గో బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

News December 11, 2024

మోహన్‌ బాబుకు ఇంటర్నల్ గాయాలయ్యాయి: వైద్యులు

image

మోహన్ బాబు నిన్న రాత్రి అస్వస్థతతో తమ ఆసుపత్రిలో చేరారని కాంటినెంటల్ వైద్యులు తెలిపారు. ‘ఆయన వచ్చిన సమయంలో హైబీపీ ఉంది. వివిధ పరీక్షలు చేశాం. ఎడమవైపు కంటి కింద వాపు ఉంది. ఇంటర్నల్ గాయాలయ్యాయి. సిటీ స్కాన్ తీయాల్సి ఉంది. చికిత్సకు అవసరమైన ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. ఆయన మరో రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉంది’ అని డాక్టర్లు వెల్లడించారు.

News December 11, 2024

రేవతి మృతితో మాకేం సంబంధం?: సంధ్య థియేటర్ ఓనర్

image

TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం’ అని పేర్కొన్నారు.

News December 11, 2024

‘పుష్ప-2’ సంచలనం.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించినట్లు వెల్లడించాయి. ఈనెల 5న ఈ చిత్రం విడుదలవగా కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డు నెలకొల్పింది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు.

News December 11, 2024

సొరోస్‌తో ‘నెహ్రూ’ల బంధం ఈనాటిది కాదు: BJP

image

భారత వ్యతిరేకి జార్జ్ సొరోస్‌తో నెహ్రూ-గాంధీ కుటుంబ బంధం ఇప్పటిది కాదని BJP తెలిపింది. ఆయనలాగే హంగేరియనైన ఫోరీ నెహ్రూ జవహర్‌లాల్ నెహ్రూ కజిన్ BK నెహ్రూను పెళ్లాడారని పేర్కొంది. రాహుల్‌కు ఆమె ఆంటీ అవుతారంది. USలో BK నెహ్రూ దౌత్యవేత్తగా ఉన్నప్పటి నుంచి ఫోరీతో సొరోస్‌కు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై గాంధీ-నెహ్రూ కుటుంబం రాజీపడటంపై సందేహాలు లేవనెత్తుతున్నాయంది.

News December 11, 2024

హైకోర్టులో మోహన్‌బాబు లంచ్‌ మోషన్ పిటిషన్

image

TG: పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ నటుడు మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది మధ్యాహ్నం 2.30గంటలకు విచారణకు రానుంది. మరోవైపు మంచు మనోజ్ కాసేపట్లో రాచకొండ సీపీ ఎదుట హాజరు కానున్నారు. జల్‌పల్లి వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

News December 11, 2024

ఇందులో మీ ఫేవరెట్ మాస్ సీన్ ఏంటి?

image

‘పుష్ప-2’ సినిమాలోని గంగమ్మ జాతర ఎపిసోడ్ అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. అయితే, కొందరేమో తమ హీరోల సినిమాల్లోని మాస్ సీన్లే బాగున్నాయని పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ నటించిన ‘సలార్’లో కాటేరమ్మ కొడుకు సీన్, RRR సినిమాలోని రామరాజు(చరణ్) ఇంట్రో & జంతువులతో ఎన్టీఆర్ సీన్లు సూపర్ అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నాలుగింట్లో మీ ఫేవరెట్ ఏంటో లేదా మీకు ఇష్టమైనదేదో కామెంట్ చేయండి.

News December 11, 2024

దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం

image

దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి కిమ్ యాంగ్-హ్యూన్ పోలీస్ కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ దేశంలో మార్షల్ లా అమలు చేసేందుకు ఈ నెల 3న జరిగిన విఫలయత్నం వెనుక ప్రధాన కారణం ఆయనేనన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయన తన రక్షణమంత్రి పదవికి రాజీనామా చేయగా, పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో తన అండర్‌వేర్‌ వాడి సూసైడ్ చేసుకునేందుకు కిమ్ ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

News December 11, 2024

రియాలిటీ షో కోసం రూ.118 కోట్లు ఖర్చు!

image

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్ కొత్త రియాలిటీ షో నిర్వహించనున్నారు. అమెజాన్‌తో కలిసి ఆయన ‘బీస్ట్ గేమ్స్’ పేరుతో కొత్త రియాలిటీ షో కోసం సెట్ నిర్మించేందుకు $14 మిలియన్స్ (రూ.118 కోట్లు) వెచ్చించినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ సిరీస్‌లో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విజేతకు 5 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు సమాచారం. రియాలిటీ షోల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలవనుంది.

News December 11, 2024

మా నాన్న దేవుడు: మనోజ్

image

TG: కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మంచు మనోజ్ తెలిపారు. ‘మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పనివారు చేసుకుంటున్నాం.’ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.