News February 7, 2025
కోహ్లీ ఆడితే జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?

మోకాలి గాయంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడతారని సపోర్ట్ స్టాఫ్ తెలిపింది. అయితే ఆయన తుది జట్టులోకి వస్తే తొలి వన్డే ఆడిన ప్లేయర్లలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ స్థానంలో ఆడిన శ్రేయస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నేపథ్యంలో అతడిని పక్కనపెట్టే అవకాశం కనిపించడం లేదు. జైస్వాల్‌ను తప్పించి గిల్‌ను ఓపెనింగ్, కోహ్లీని వన్ డౌన్‌లో ఆడించే ఛాన్సుంది.
Similar News
News March 18, 2025
రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్‌లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.
News March 18, 2025
OTTలోకి కొత్త సినిమాలు

తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగులో ఈనెల 14న థియేటర్లలో రిలీజైంది. వారం రోజుల్లోనే OTT బాట పట్టింది. ఈనెల 21 నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.
News March 18, 2025
GREAT JOURNEY: బాల్ బాయ్ టు ఐపీఎల్ టీమ్ కెప్టెన్

స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జర్నీ స్ఫూర్తిదాయకం. 2008 IPL ప్రారంభ ఎడిషన్‌లో MIvsRCB మ్యాచ్‌కు బాల్ బాయ్‌గా ఉన్న అతను 2024లో KKRకు, ఇప్పుడు PBKSకు కెప్టెన్ అయ్యారు. తాజాగా ఆనాటి జ్ఞాపకాలను అయ్యర్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు రాస్ టేలర్, ఇర్ఫాన్ పఠాన్‌తో మాట్లాడినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకు ట్రోఫీ గెలవని పంజాబ్‌కు ఆ కోరిక తీరుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.