news

News August 5, 2024

కేసీఆర్‌, హరీశ్‌రావుకు సెషన్స్ కోర్టు నోటీసులు

image

TG: మేడిగడ్డ పిల్లర్‌కు పగుళ్లు ఏర్పడిన వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సహా 8 మందికి‌ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు సూచనల మేరకు నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై సెప్టెంబర్ 5న విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. విచారణకు హాజరుకావాలని కేసీఆర్, తదితరులను ఆదేశించింది.

News August 5, 2024

నన్ను అంతమొందించడమే ప్రభుత్వ లక్ష్యం: YS జగన్

image

AP: గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలంటూ హైకోర్టులో <<13783281>>పిటిషన్<<>> వేసిన మాజీ CM జగన్ అందులో కీలక విషయాలు పొందుపర్చారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

News August 5, 2024

పతకాలతో ఐఫిల్ టవర్ ‌వద్ద మను

image

పారిస్‌కు తలమానికమైన ఐఫిల్ టవర్ ఎదుట మనూ భాకర్ తన కాంస్య పతకాలతో తాజాగా ఫొటో దిగారు. ‘పిక్ ఆఫ్ ది డే’ అంటూ క్రీడాభిమానులు ఆ ఫొటోను షేర్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలు రాగా వాటిలో రెండు మనూ భాకర్‌వే. 124 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టిన ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలు బ్రాండ్లు ఆమెను తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు పోటీ పడుతున్నాయి.

News August 5, 2024

కల్తీ పసుపును ఎలా గుర్తించాలి?

image

పసుపును కృత్రిమ రంగులు కలిపి కల్తీ చేస్తుంటారు. దీనిని గుర్తించాలంటే నీటితో నింపిన రెండు గాజు గ్లాసులను తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న రెండు రకాల పసుపును వేర్వేరు గ్లాసుల్లో ఒక టీస్పూన్ చొప్పున వేయాలి. కల్తీ జరగని పసుపు వేసిన గ్లాసులో నీళ్లు లేత పసుపు రంగులోకి మారుతాయి. పసుపు అడుగు భాగంలో చేరుతుంది. కల్తీ జరిగిన పసుపు నీటిలో చాలా వరకు కరిగిపోతుంది. నీళ్లు ముదురు పసుపు రంగులోకి మారుతాయి.

News August 5, 2024

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

image

AP: అమరావతిలో ఆర్5 జోన్ లబ్ధిదారుల అంశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్5 జోన్‌లో విజయవాడ, గుంటూరు వాసులకు గత ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. వారికి సొంత ప్రాంతాల్లోనే స్థలం ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇద్దామని అధికారులతో సీఎం చెప్పినట్లు సమాచారం.

News August 5, 2024

భారత్ చేరిన హసీనా.. ఆ తర్వాత UKకు!

image

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. ఆమె విమానం UPలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యింది. ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్లే అవకాశం ఉంది. తనకు ఆశ్రయం కల్పించాలని UK ప్రభుత్వాన్ని హసీనా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతుండగా సైనిక పాలన అమలులోకి వచ్చింది.

News August 5, 2024

రేపు విజయవాడకు మాజీ సీఎం జగన్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. జగ్గయ్యపేటలో దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తను పరామర్శించనున్నారు. శుక్రవారం నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సుబ్బారాయుడిని పోలీసుల ముందు టీడీపీ నేతలు చంపారని వైసీపీ ఆరోపిస్తోంది.

News August 5, 2024

48 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేయాలి: సీఎం

image

AP: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలను పక్కనపెట్టాలని సూచించారు. రైతులకు అనుకూలంగా ఉండేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని సీఎం పేర్కొన్నారు.

News August 5, 2024

హైకోర్టుకు జగన్

image

AP: మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తనకు మరమ్మతులకు గురైన వాహనాన్ని కేటాయించిందని అందులో పేర్కొన్నారు. కాగా అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News August 5, 2024

ఆ టైంలో చెట్లు బ్రీతింగ్ ఆపేస్తాయ్!

image

మనుషుల్లాన్లే చెట్లూ శ్వాసక్రియ జరుపుతుంటాయి. C02ని పీల్చుతూ ఆక్సిజన్‌ను వదులుతుంటాయి. చెట్ల ఆకులు ఈ ప్రక్రియ నిర్వహిస్తుంటాయి. అయితే కార్చిచ్చుల వేళ వెలువడే హానికర వాయువుల నుంచి రక్షించుకునేందుకు కొన్ని చెట్లు బ్రీతింగ్ ఆపేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ సమయంలో చెట్ల ఆకుల రంద్రాలు మూసుకుపోయాయని, కిరణజన్య సంయోగక్రియ సైతం ఆగినట్లు తెలిపారు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు.