India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైద్యశాస్త్రంలోని సంఘటనలు అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే HYDలో జరిగింది. సోమాలియాకు చెందిన యువకుడికి చిన్నప్పుడు సున్తీ కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి పురుషాంగం తొలగించారు. తిరిగి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరికి హైటెక్ సిటీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించాడు. వైద్యులు అతడి మోచేతిపై పురుషాంగాన్ని డెవలప్ చేసి, దాన్ని మర్మాంగాలు ఉండే ప్లేస్‌లో అమర్చారు.

‘పాతాల్ లోక్’ వెబ్ సిరీస్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా హాథీరామ్ చౌదరి పాత్రలో జైదీప్ అహ్లావత్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. 2020లో రిలీజైన మొదటి పార్ట్‌కు కేవలం రూ.40లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న అతను ఇప్పుడు ఏకంగా రూ.20 కోట్లు అందుకున్నారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో సక్సెస్ అంటే ఇదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

AP: స్వయం ఉపాధి కోసం BC కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 12 వరకు పొడిగించింది. అర్హులైన BC, EBCలు అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సవిత సూచించారు. కుట్టు శిక్షణ, కోళ్లఫారాలు, పాడి, ఫొటో స్టూడియోలు, జిరాక్స్ షాపులు, ఇంటర్ నెట్ కేంద్రాలు, బ్యూటీపార్లర్లు తదితర యూనిట్లకు రూ.2-5లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% సబ్సిడీ లభిస్తుంది.
వెబ్‌సైట్: <

✒ వయసు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి. వార్షికాదాయం పట్టణాల్లో 1.30లక్షలు, గ్రామాల్లో రూ.81వేల లోపు ఉండాలి.
✒ రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే అర్హులు
✒ కావాల్సిన పత్రాలు: వైట్ రేషన్ కార్డు, కుల, వయసు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, ఫొటో
✒ 1,30,000 మంది బీసీలకు రూ.896 కోట్లు, ఈబీసీ వర్గాలు(బ్రాహ్మిణ్, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు)లకు రూ.384 కోట్లు కేటాయించారు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ODIకి విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మోకాలిలో వాపు కారణంగా ఆయన తప్పుకొన్నారు. మరి రెండో వన్డేలో ఆడతారా? ఈ ప్రశ్నకు బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జవాబిచ్చారు. ‘సరిగ్గా మ్యాచ్ రోజు నిద్రలేచే సమయానికి విరాట్ మోకాలు వాచింది. దీంతో ముందు జాగ్రత్తగా తొలి వన్డే మ్యాచ్ నుంచి తప్పుకొన్నారు. అది పెద్ద గాయం కాదు. రెండో మ్యాచ్ కచ్చితంగా ఆడతారనుకుంటున్నాను’ అని తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇవాళ ఉదయం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని పాఠశాలలకు కూడా ఈ థ్రెట్స్ రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయా స్కూళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

TG: తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక’ అని ఆరోపించారు.

‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆ తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. ముకుంద, నారప్ప ఫర్వాలేదనిపించగా బ్రహ్మోత్సవం, పెదకాపు నిరాశపరిచాయి. దీంతో ఆయన మరోసారి SVSC తరహా కుటుంబ కథను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కాచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగాలే ఇతివృత్తంగా ‘కూచిపూడి వారి వీధి’ అన్న మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఈనెల 26న శివరాత్రి కావడంతో స్కూళ్లకు పబ్లిక్ హాలిడే ఉంది. అలాగే పలు జిల్లాల్లో 27న కూడా సెలవు ఉండనుంది. ఆరోజు TGలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC, APలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. APలో శ్రీకాకుళం, విజయనగరం, VZG, ఉ.గోదావరి, కృష్ణా, GTR, TGలో MDK, NZB, ADB, KNR, WGL, KMM, NLGలో టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

TG: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అనారోగ్యం లేదా అత్యవసర కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కాని వారికి మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విద్యార్థులు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని సంప్రదించాలని సూచించింది. ఈనెల 22తో ఇంటర్ ప్రాక్టికల్స్ ముగియనున్నాయి.
Sorry, no posts matched your criteria.