news

News December 11, 2024

నేడు ఓ మోస్తరు వానలు.. రేపు భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు APలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయంది. రేపు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

News December 11, 2024

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

image

TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్‌ల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుందని, 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.

News December 11, 2024

‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300

image

AP: ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పనులు ఎలా చేపడితే రూ.300 కూలి వస్తుందో కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. దీనిపై కలెక్టర్లు, డ్వామా PDలకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.

News December 11, 2024

BITCOIN: 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే $6500 (Rs 5.5L) మేర నష్టపోయింది. ఇవాళ $96,593 వద్ద మొదలైన BTC $539 నష్టంతో $96,093 వద్ద ట్రేడవుతోంది. Mcap $1.94 ట్రిలియన్ల నుంచి $1.91 ట్రిలియన్లకు తగ్గింది. ETH, USDT, XRP, SOL, BNP, DOGE, USDC, ADA, TRX కాయిన్లూ నష్టాల్లోనే ఉన్నాయి.

News December 11, 2024

‘రైతుభరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?

image

TG: రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ICICI బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి RBIకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాలకు ఖర్చు చేయనుంది.

News December 11, 2024

మోహన్‌బాబుపై కేసు నమోదు

image

TG: మీడియా ప్రతినిధులపై <<14843588>>దాడి<<>> చేసినందుకు నటుడు మోహన్‌బాబుపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయనపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే నిన్న ఆయనకు నోటీసులు జారీ చేసిన రాచకొండ పోలీసులు ఇవాళ ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే నిన్న తీవ్ర ఘర్షణ తర్వాత మోహన్‌బాబు ఆసుపత్రిలో చేరారు.

News December 11, 2024

పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఓడించగలం కానీ.: అమెరికా

image

చైనాను ఓడించడం తమకు సాధ్యమేనని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ స్పష్టం చేశారు. కానీ సాంకేతికంగా డ్రాగన్‌పై తమకున్న పైచేయి క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘క్షిపణి టెక్నాలజీ, సమాచార వ్యవస్థలపై US ప్రధానంగా దృష్టి సారించాలి. సైబర్ దాడుల్ని తట్టుకునేలా ఆ సమాచార వ్యవస్థ ఉండాలి. క్షిపణులకు చాలా ఖర్చవుతోంది. పోరాటాల్లో వాటి బదులు డ్రోన్లను వాడాలి’ అని పేర్కొన్నారు.

News December 11, 2024

STOCK MARKETS: భారీ నష్టాలు తప్పవా..

image

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వొచ్చు. నిన్న US, EU సూచీలన్నీ ఎరుపెక్కాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. గిఫ్ట్ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,678 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నిఫ్టీ నిరోధం 24,678, మద్దతు 24,510 వద్ద ఉన్నాయి. STOCKS TO WATCH: ఆఫిస్ స్పేస్, IOB, HG INFRA, LTIM, SAAKSHI MEDTECH, ASIAN PAINTS, MOREPEN LAB, NTPC GREEN.

News December 11, 2024

త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు

image

AP: ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు రాష్ట్రంలో ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వగా 12 స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.15లక్షలు కాగా, లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్లకు లైసెన్సులిస్తారు. కనీసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

News December 11, 2024

మార్చి 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్!

image

AP: వచ్చే ఏడాది మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి లభించగానే పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.