news

News December 11, 2024

సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డ్

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరకు రవాణాలో రికార్డ్ సృష్టించింది. 249రోజులకు గానూ 5.5కోట్ల టన్నులు రవాణా చేసినట్లు పోర్టు ఛైర్మన్ ఎం.అంగముత్తు చెప్పారు. అటు, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.109కోట్ల టన్నుల సరకు రవాణా చేసినట్లు వెల్లడించారు. రవాణా ఆశించిన స్థాయిలో ఉండటంతో రైల్వే, కస్టమ్స్, జాతీయ రహదారుల సంస్థ, ప్రభుత్వరంగ సంస్థలతో పాటు అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News December 11, 2024

నేడు జైపూర్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే బంధువుల వివాహానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం సీఎం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హస్తినలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలుస్తారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. సీఎం తిరిగి గురువారం హైదరాబాద్ చేరుకుంటారు.

News December 11, 2024

అమెరికాకు తగ్గిన భారత విద్యార్థులు

image

ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది తగ్గింది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 మంది విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు జారీ అయ్యాయి. అదే గతేడాది, ఇదే కాలంలో లక్షకు పైగా వీసాలు మంజూరైనట్లు అమెరికన్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్ వెబ్‌సైట్ స్పష్టం చేసింది. కొవిడ్ తర్వాత భారత విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాలు తగ్గడం ఇదే తొలిసారి. అటు, చైనా నుంచి కూడా 8% తగ్గుదల కనిపించింది.

News December 11, 2024

యంగ్ డైరెక్టర్‌తో గోపిచంద్ మూవీ?

image

‘విశ్వం’ తర్వాత గోపీచంద్ నటించే మూవీపై అప్‌డేట్ రాలేదు. తాజాగా, ఆయన ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల డైరెక్టర్ ఓ కథ చెప్పగా అది గోపిచంద్‌కు నచ్చి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కథ విభిన్నమైందని, చిట్టూరి శ్రీనివాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

News December 11, 2024

నేటి నుంచి శివ దీక్షా విరమణ ప్రారంభం

image

AP: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక‌మాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది. 15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్పారు. గత నెల 2న మండల దీక్ష, 21న అర్ధమండల దీక్ష స్వీకరించిన భక్తులు విరమించవచ్చన్నారు. ఇవాళ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 11, 2024

బ్యాంకుల్లో మొండి బాకీలపై కేంద్ర మంత్రి ప్రకటన

image

ప్రభుత్వరంగ బ్యాంకులిచ్చిన రుణాల మొండి బాకీలు 3.09% ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. గత సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకులు మంజూరు చేసిన దాని విలువ రూ.3.16లక్షల కోట్లు అని రాజ్యసభలో వెల్లడించారు. అటు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు రూ.1.34లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపారు. అది 1.86%కి సమానమన్నారు. ప్రభుత్వ రంగం(3.09%)తో పోలిస్తే ఇది తక్కువ అని స్పష్టం చేశారు.

News December 11, 2024

3వ టెస్టులో ఆకాశ్ దీప్‌ను ఆడించాలి: సంజయ్ మంజ్రేకర్

image

BGT 3వ టెస్టులో హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్‌ను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. బ్రిస్బేన్ పిచ్ కండిషన్లు అతని బౌలింగ్ శైలికి సరిపోతాయన్నారు. 2వ టెస్టులో రాణా రన్స్ ఇచ్చారనే కారణమే కాకుండా పిచ్ పేస్‌కు అనుకూలిస్తుందనుకుంటే ఆకాశ్‌ను ఆడించే ఆలోచన చేయాలన్నారు. అడిలైడ్ మాదిరి బ్రిస్బేన్ పిచ్ కూడా ఫ్లాట్‌గా ఉంటే బుమ్రా, సిరాజ్, రాణా లేదా ఆకాశ్ బౌలింగ్ ఎటాక్ సరిపోదని చెప్పారు.

News December 11, 2024

చలికాలంలో రోగనిరోధక శక్తికి ఇవి తినండి!

image

చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇవి దూరమవుతాయి. విటమిన్ C ఉండే ఆరెంజ్, లెమన్, నిమ్మను ఆహారంలో భాగం చేయాలి. అల్లం, వెల్లుల్లి తరచూ తీసుకోవాలి. ఈ సీజన్‌లో లభించే చిలగడదుంపలు తింటే బీటా కెరోటిన్ శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బచ్చలకూర, కాలే వంటి ఆకుకూరలు తింటే వాటిలోని విటమిన్ A,C,Kలతో రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.

News December 11, 2024

శ్రీలీలకు పెళ్లి చేసే బాధ్యత నాదే: సీనియర్ హీరో

image

అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీలపై ప్రేమను సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. ఈ బ్యూటీకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని చెప్పారు. మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని వెతికిపెడతానని తెలిపారు. అంతకుముందు తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని శ్రీలీల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.

News December 11, 2024

‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క

image

TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.