India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్‌కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.
TG: జల్‌పల్లిలో హైటెన్షన్ నెలకొంది. మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. వెంటనే ఆయన నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
దిగ్గజ కన్నడ నటుడు దివంగత రాజ్‌కుమార్‌ను వీరప్పన్ చెర నుంచి విడిపించడంలో అప్పటి కర్ణాటక CM <<14836897>>SM కృష్ణ<<>> కీలకపాత్ర పోషించారు. 1999లో CM పదవి చేపట్టిన కృష్ణకు 2000లో కిడ్నాప్ వ్యవహారం సవాల్ విసిరింది. 102 రోజులు బంధీగా ఉన్న రాజ్‌కుమార్‌ను విడిపించడానికి బలగాలు, మధ్యవర్తులు, తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. సురక్షితంగా ఆయన్ను విడిపించి మన్ననలు పొందారు.
AP: వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు. RTGS, వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
2025 నుంచి UG లో ప్రవేశాలకు Common University Entrance Testలో విద్యార్థులు గరిష్ఠంగా ఆరుకు బదులు 5 సబ్జెక్టులు రాయగలరు. *సబ్జెక్టుల సంఖ్య 63 నుంచి 37కి తగ్గింపు. *కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షల్లో ఐచ్ఛిక ప్రశ్నలను తొలగించడంతో అన్ని ప్రశ్నలను 60 Minలో అటెంప్ట్ చేయాలి. *12వ తరగతిలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టు పరీక్షకైనా హాజరుకావచ్చు. Share It.
న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో 1963లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవిని ప్రదర్శనకు ఉంచారని తెలియడంతో ప్రజలంతా క్యూ కట్టారు. జూలోకి ప్రవేశించి బోనులో ఉన్న జీవిని చూసి అంతా షాక్ అయ్యారు. అయితే, ఆ జీవి ఎవరో కాదు.. మనిషే. బోనులో అద్దాన్ని ఉంచడంతో ఎవరి ముఖాలు వారికి కనిపించాయి. అలాగే, 1968లోనూ చికాగోలోని బ్రూక్‌ఫీల్డ్ జూలో ఇదే తరహా ప్రదర్శన చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం పవన్ చివరి షెడ్యూల్‌లో పాల్గొన్నారని ఓ ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. ఫొటోలో వీరమల్లు గెటప్‌లో పవన్ స్క్రిప్ట్ చదువుతున్నట్లు కనిపించారు. వచ్చే ఏడాది మార్చి 28న ఈ చిత్రం రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు ఆర్.కృష్ణయ్య, సానా సతీశ్, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబును అమరావతిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు మర్యాదపూర్వకంగా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అటు 3 స్థానాలకు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా గెలవబోతున్న వీరిని చంద్రబాబు అభినందించారు.
AP: వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రేపు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ఓటమి, బాలినేని పార్టీ వీడటం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
AP: డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని త్వరలోనే లబ్ధిదారులకు ‘క్రిస్మస్ కానుక’ అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తాం’ అని మంత్రి ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.