News February 7, 2025
క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల

AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్‌సెంటీవ్‌లను పెండింగ్‌లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.
Similar News
News March 24, 2025
31 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని
31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News March 24, 2025
APR 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు!

AP: ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి.
News March 24, 2025
ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు

TG: 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నాటికి వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 స్కూళ్లలో AI టూల్స్‌ను వినియోగిస్తూ ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు. 25-26 విద్యా సంవత్సరంలో మరిన్ని స్కూళ్లలో దీనిని అమలు చేయనున్నారు.