India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ మళ్లీ గెలుస్తుందనే భ్రమలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆయనకు దమ్ముంటే మంత్రి లోకేశ్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడే ఎవరి గొప్ప ఏంటో తెలుస్తుందన్నారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు.
TG: పౌరసత్వం కేసులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను హైకోర్టు <<14829902>>జర్మనీ పౌరుడేనని తేల్చడంపై<<>> ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ చీఫ్ KCRకి చెంపపెట్టు అని అన్నారు. దేశ పౌరసత్వం లేని వారికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. లా బ్రేక్ చేసిన వ్యక్తిని లా మేకర్‌గా కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
AP: ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్‌సైటును ప్రారంభించాలన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగం జరిగిందని విపక్షాలు చేస్తున్న ఆరోణలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 288 నియోజకవర్గాల్లో 1,445 వీవీప్యాట్‌లను ఆయా ఈవీఎంలలో పోలైన ఓట్లతో క్రాస్ చెక్ చేయగా ఎలాంటి వ్యత్యాసం కనపించలేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి స్థానంలో ఐదు చొప్పునా వీవీప్యాట్‌లను లెక్కించినట్లు తెలిపింది.
కరోనాతో అల్లాడిన ప్రపంచదేశాలకు సైంటిస్టులు మరో వార్నింగ్ ఇచ్చారు. USలో జంతువులు, పక్షుల్లో విజృంభిస్తోన్న H5N1 బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషుల్లో విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. మ్యుటేషన్ చెందిన తర్వాత ఈ వైరస్ ప్రాణాంతకమని, సోకినవారిలో 50% మంది చనిపోతారని తెలిపారు. దీన్ని నిరోధించడానికి జంతువుల ఇన్ఫెక్షన్‌లను నిశితంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. లేదంటే మరో ప్రపంచ విపత్తుగా మారుతుందన్నారు.
AP: అన్ని ప్రభుత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని CM చంద్రబాబు సూచించారు. సమర్థవంతమైన పాలన అందించేలా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి అన్ని శాఖలతో అనుసంధానం చేయాలని RTGSపై సమీక్షలో ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని RTGS సమీకృతం చేసి, మొత్తం పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. కుల ధ్రువీకరణ దగ్గర నుంచి ఆదాయ, ఇతర ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు.
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూవీ విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.922 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. భారత సినీ చరిత్రలో ఇది రికార్డ్ అని పేర్కొంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి టికెట్ ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.
అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శేఖర్ యాదవ్ తొలగింపునకు పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయించింది. దేశంలో మెజారిటీ ప్రజల అభీష్టానికి పాలన సాగాలంటూ జడ్జి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవసరమైన బలాన్ని కూడగట్టేందుకు NC ప్రయత్నిస్తోంది. జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా నివేదిక కోరింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ షూటింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని వస్తోన్న వార్తలపై బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలన్నీ ఫేక్ అని, ఆయన ఎలాంటి రోల్ చేయట్లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
భార్య వేధింపులతో <<14841616>>ఆత్మహత్య<<>> చేసుకున్న అతుల్ సుభాష్‌కు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. #JusticeForAtulSubhash అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. న్యాయం, అన్యాయం ఏంటో తెలియకుండా మగవారిదే తప్పు అని నిర్ణయించడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. పిల్లల పేరుతో అధికంగా భరణం డిమాండ్ చేస్తున్నారని.. ఈ ఆత్మహత్యతో ఇవన్నీ ఆగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.