news

News December 10, 2024

బాక్సింగ్ డే టెస్ట్.. ఫస్ట్ డే టికెట్లన్నీ సేల్

image

ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టుకు ఉన్న క్రేజే వేరు. ఆ మ్యాచ్ తొలి రోజుకు సంబంధించి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. ఈ నెల 26న మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో మ్యాచ్ జరగనుండగా ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ లక్షగా ఉంది. మ్యాచ్‌కు 15 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడవడం గమనార్హం. కాగా మూడో టెస్టు ఈ నెల 14న గబ్బా స్టేడియంలో జరగనుంది.

News December 10, 2024

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ: AISF

image

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై AP ప్రభుత్వం విచారణ చేయించాలని AISF జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘MBUలో ఫీజుల దోపిడీపై మంచు మనోజ్ స్టేట్‌మెంట్‌ను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రతి విద్యార్థి దగ్గర ఏటా ₹20,000 అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన పేరెంట్స్‌ను మోహన్ బాబు బౌన్సర్లతో కొట్టిస్తున్నారు. స్టూడెంట్స్‌ను ఫెయిల్ చేయిస్తున్నారు’ అని ఆరోపించారు.

News December 10, 2024

ప్రజా సమస్యల పోరాటంపై తగ్గేదేలే: సజ్జల

image

AP: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని YCP స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ప్రజల గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి. సమస్యలపై సర్కార్ దిగొచ్చేవరకూ బాధితులకు అండగా నిలవాలి. కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడాలి’ అని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

News December 10, 2024

నేను ఏ పార్టీ మారలేదు: ఆర్.కృష్ణయ్య

image

AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లే పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పనిచేస్తానని తెలిపారు. కేంద్రంలో బీసీల నాయకత్వమే ఎక్కువని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News December 10, 2024

ఒక్క టూర్‌తో రూ.16వేల కోట్లు సంపాదించిన సింగర్!

image

అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ‘ది ఎరాస్ టూర్’ ముగిసింది. 21 నెలల పాటు ఐదు ఖండాల్లో 149 ప్రదర్శనలు నిర్వహించగా వీటిల్లో 10 మిలియన్ల మంది పాల్గొన్నారు. మొన్న బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో జరిగిన ప్రదర్శనతో ఈ టూర్ పూర్తయింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ టూర్ ద్వారా ఆమె $2 బిలియన్లను (రూ.16వేల కోట్లు) వసూలు చేసి రికార్డు సృష్టించారు. దీంతో ఆమె బిలియనీర్ హోదాను పొందారు.

News December 10, 2024

2025 ఎలా ఉండబోతోంది.. వందల ఏళ్ల కిందటే చెప్పిన నోస్ట్రాడమస్!

image

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో 2025 ఎలా ఉండబోతుందో ఫ్రెంచ్ జ్యోతిషుడైన నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు వైరలవుతున్నాయి. వచ్చే ఏడాది భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని, లేదా దగ్గరగా రావచ్చని అంచనా వేశారు. ‘దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది. బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది’ అని జోస్యం చెప్పారు.

News December 10, 2024

ఈ ఏడాదిలో విమానాలకు 719 బాంబు బెదిరింపు కాల్స్

image

విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు గత ఐదేళ్లలో 809 ఫేక్ బాంబ్ థ్రెట్స్ వచ్చినట్లు పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది. ఇందులో 719 కేసులు 2024లోనే నమోదైనట్లు వెల్లడించింది. 2020లో నాలుగు, 2021లో రెండు, 2022లో 13, 2023లో 71 బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, చాలా సార్లు కావాలనే ఇలాంటి ఫేక్ కాల్స్, మెసేజ్‌లు చేసినట్లు నిందితులు ఒప్పుకోవడం గమనార్హం.

News December 10, 2024

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: బొత్స

image

AP: రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.20 వేలు ఎప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతులను దళారులు దోచుకు తింటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News December 10, 2024

పాక్‌లో తొలి హిందూ పోలీస్‌గా రాజేందర్

image

పాకిస్థాన్‌లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్ నిలిచారు. సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్‌కు చెందిన రాజేందర్ అక్కడి CSS(సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్)ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ట్రైనింగ్ అనంతరం ఆయన ఫైసలాబాద్‌లో ASPగా బాధ్యతలు చేపట్టారు. రాజేందర్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే యువతి CSS ఎగ్జామ్ క్లియర్ చేశారు. పాక్‌లోని మైనార్టీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

News December 10, 2024

నార్త్‌లో దుమ్మురేపుతున్న ‘పుష్ప-2’

image

‘పుష్ప-2’ హిందీ కలెక్షన్స్ రూ.400కోట్లకు చేరువలో ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన 5 రోజుల్లోనే రూ.339 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.48 కోట్లు రాబట్టగా, అంతకుముందు తొలి 4 రోజుల్లో వరుసగా రూ.72 కోట్లు, రూ.59 కోట్లు, రూ.74కోట్లు, రూ.86 కోట్లు సాధించింది. నార్త్ అమెరికాలో $10M+ వసూళ్లతో దూసుకుపోతోంది.