news

News August 5, 2024

షాద్‌నగర్ ఘటనలో ఆరుగురు పోలీసులు సస్పెండ్

image

TG: HYDలోని షాద్‌నగర్‌లో ఓ దళిత మహిళను పోలీసులు దారుణంగా కొట్టిన <<13777846>>ఘటనపై<<>> పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన CM రేవంత్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ్యులు తప్పించుకోలేరన్నారు.

News August 5, 2024

బంగ్లా అల్లర్లు: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఆర్మీ

image

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. తాము తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ప్రజలు తమను విశ్వసించాలని టెలివిజన్ మాధ్యమం ద్వారా కోరారు. రిజర్వేషన్ల హింసాకాండలో బలైనవారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. హంతకులను తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పాలనపై ఇప్పటికే BNP, జాతీయ పార్టీ, జమాత్ ఈ ఇస్లామీ పార్టీలతో చర్చించామన్నారు.

News August 5, 2024

ఆ వివరాలు వెల్లడించలేం: రక్షణ శాఖ

image

దేశ‌ సాయుధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివ‌రాలు, వాటి భ‌ర్తీకి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను బ‌హిర్గతం చేయ‌డం దేశ భ‌ద్ర‌త‌కు మంచిదికాద‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. ఇది సున్నిత‌మైన అంశ‌మని పేర్కొంది. సాయుధ ద‌ళాల్లోని ఖాళీలు, వాటి భ‌ర్తీపై కాంగ్రెస్‌ ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి సంజ‌య్ సేథ్ ఈ మేర‌కు బ‌దులిచ్చారు.

News August 5, 2024

భారత్-బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్

image

బంగ్లాదేశ్‌లో హింస, ప్రధాని షేక్ హసీనా <<13782099>>రాజీనామా<<>> నేపథ్యంలో భారత్-బంగ్లా సరిహద్దుల్లో BSF హైఅలర్ట్ జారీ చేసింది. ఆ దేశంతో భారత్ 4,096కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో BSF భద్రతను కట్టుదిట్టం చేసింది. కాగా బంగ్లాను వీడిన హసీనా భారత్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి.

News August 5, 2024

రుణమాఫీ కానివారు ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి: BRS

image

TG: రుణమాఫీ జరగని రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రకటించింది. అర్హులై ఉండి ఇప్పటి వరకూ రూ.లక్ష, రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ కాని వారు 8374852619 నంబర్ ద్వారా వాట్సాప్‌లో తమ వివరాలను తెలియజేయాలని సూచించింది. రేవంత్ ప్రభుత్వం ఇటీవల రూ.లక్ష, రూ.లక్షన్నరలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే.

News August 5, 2024

ఎవరీ షేక్ హసీనా?

image

బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తప్పుకొన్న షేక్ హసీనా ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు. ఆమె 2009 నుంచి బంగ్లాకు ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా ఆమె నిలిచారు. సివిల్ సర్వీసుల్లో <<13782223>>రిజర్వేషన్ కోటా<<>> రద్దు చేయాలంటూ అక్కడి విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో చివరికి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

News August 5, 2024

కష్టాల్లో ఫస్ట్ లేడీ బస్ డ్రైవర్‌!

image

TG: దేశంలోనే ఫస్ట్ లేడీ బస్ డ్రైవర్‌ వాంకుడోతు సరిత(NLG జిల్లా) ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. సాయం చేయాలని ఆమె మంత్రి కోమటిరెడ్డిని కలిసి వేడుకున్నారు. 2015లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్‌గా చేశారు. అప్పటి రాష్ట్రపతి కోవింద్ కూడా ఆమెను ప్రశంసించారు. అయితే తల్లిదండ్రులను చూసుకునేందుకు ఆమె ఉద్యోగం వదిలి ఇక్కడికి వచ్చారు. కాగా సరితకు ఉద్యోగం ఇప్పించాలని మంత్రి పొన్నం, RTC MDని కోమటిరెడ్డి కోరారు.

News August 5, 2024

బంగ్లాదేశ్‌లో ‘రిజర్వేషన్ల’ వివాదమేంటి?

image

1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పోరాడినవారి కుటుంబీకులకు ప్రభుత్వం 30% రిజర్వేషన్లు కల్పించింది. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనలకు దిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను 5శాతానికి తగ్గించాలని సుప్రీం ఆదేశించింది. 93% ప్రతిభ ఆధారంగా, 2% మైనార్టీలు, దివ్యాంగులకు కేటాయించాలంది. పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్.

News August 5, 2024

థాంక్స్ నాని.. నీ విష్ నిజం కావాలి: అల్లు అర్జున్

image

దసరా సినిమాకు నాని ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు, అల్లు అర్జున్‌కు మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ నడిచింది. నాని తన ఫిలింఫేర్ గురించి చెబుతూ చేసిన ట్వీట్‌కి బన్నీ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. స్పందించిన నాని, వచ్చే ఏడాది మీ ‘రూల్’కి కూడా అనేక అవార్డులు దక్కాలంటూ అభిలషించారు. తాను కూడా అది నిజం కావాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ బదులిచ్చారు.

News August 5, 2024

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తన అరెస్ట్ అక్రమమంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు, ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయనకు కోర్టు ఆగష్టు 8 వరకు జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.