India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణ హాని ఉందని నటుడు మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. HYDలోని నివాసంలో పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. మనోజ్‌పై దాడి గురించి ప్రశ్నిస్తున్నారు. ఆదివారం జరిగిన దాడి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మోహన్ బాబును పోలీసులు కోరారు.
పసిఫిక్ ద్వీప దేశమైన పాపువా న్యూగినియా ప్రజలు గతంలో ఓ విచిత్రమైన ఆచారాన్ని పాటించారు. అక్కడి కొన్ని జాతుల వారు కుటుంబసభ్యులెవరైనా చనిపోతే సంతాపంగా తమ వేళ్లను నరికేసుకునేవారు. ఇది తీవ్ర దుఃఖాన్ని, నష్టాన్ని వ్యక్తీకరిస్తుందని వారి భావన. సంప్రదాయ పరికరాలతోనే వేలి పైభాగాన్ని కట్ చేసి, సహజ పద్ధతులతో గాయాలకు చికిత్స చేసేవారు. కాలక్రమేణా ఆధునికీకరణ, చట్టపరమైన పరిమితుల కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది.
పార్లమెంటు నడుస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అసహనం చెందారు. చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొందరి ప్రవర్తన నిరాశపరుస్తోందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చాలి. మనమంతా సభా మర్యాదను పాటించాలి. కానీ కొన్ని రోజులుగా అంత మంచివి కాని ఘటనలు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.
ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ అరుదైన ఘనత సాధించారు. 2022 నుంచి ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఈ రెండేళ్లలో ఆయన 9 శతకాలు సాధించారు. అగ్రస్థానంలో శుభ్‌మన్ గిల్ (12), రెండో స్థానంలో విరాట్ కోహ్లీ (11) ఉన్నారు. నాలుగో స్థానంలో విలియమ్సన్ (8), ట్రావిస్ హెడ్ (8) కొనసాగుతున్నారు. కాగా ఇటీవల NZతో జరిగిన రెండో టెస్టులో బ్రూక్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
AP: గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం పలికింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.11,467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం పిలవనుంది. ఈ మేరకు జీవో 968ను ప్రభుత్వం జారీ చేసింది.
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనిపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. అదానీ అంశంపై కాంగ్రెస్‌తో దూరం పాటిస్తున్న తృణమూల్, సమాజ్‌వాదీ ఎంపీలూ సంతకాలు చేశారని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల పట్ల ఆయన వ్యవహార శైలి బాగాలేదన్నది ప్రధాన ఆరోపణ. సభను తటస్థ వైఖరితో నిర్వహించడం లేదని, అధికార పక్షానికే అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB29 రెండు పార్టులుగా ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే నెలలోనే సినిమా ప్రారంభమవుతుందని PINKVILLA పేర్కొంది. అయితే, మహేశ్ పాత్ర హిందూ పురాణాలు, హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన క్యారెక్టర్‌గా ఉండొచ్చని తెలిపింది. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం.
AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు TDP నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరి ఏకగ్రీవం లాంఛనమే. YCP నుంచి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య రాజీనామాతో ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరికి TDP, బీజేపీ నుంచి మళ్లీ అవకాశం దక్కింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. కాగా ఈ మూవీలో బన్నీ ధరించిన కాస్ట్యూమ్స్ గురించి చర్చ జరుగుతోంది. పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ సికో పట్టు వస్త్రాలనే అల్లు అర్జున్ ధరించారు. పోచంపల్లిలో ఈ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఆ సమయంలోనే మూవీ యూనిట్ ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేసింది.
సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైపూర్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ షెడ్యూల్లో రజినీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్ పాల్గొన్నట్లు సమాచారం. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.