India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం పలికింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.11,467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం పిలవనుంది. ఈ మేరకు జీవో 968ను ప్రభుత్వం జారీ చేసింది.
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనిపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. అదానీ అంశంపై కాంగ్రెస్‌తో దూరం పాటిస్తున్న తృణమూల్, సమాజ్‌వాదీ ఎంపీలూ సంతకాలు చేశారని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల పట్ల ఆయన వ్యవహార శైలి బాగాలేదన్నది ప్రధాన ఆరోపణ. సభను తటస్థ వైఖరితో నిర్వహించడం లేదని, అధికార పక్షానికే అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB29 రెండు పార్టులుగా ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే నెలలోనే సినిమా ప్రారంభమవుతుందని PINKVILLA పేర్కొంది. అయితే, మహేశ్ పాత్ర హిందూ పురాణాలు, హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన క్యారెక్టర్‌గా ఉండొచ్చని తెలిపింది. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం.
AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు TDP నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, BJP నుంచి కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. వీరి ఏకగ్రీవం లాంఛనమే. YCP నుంచి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, కృష్ణయ్య రాజీనామాతో ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరికి TDP, బీజేపీ నుంచి మళ్లీ అవకాశం దక్కింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. కాగా ఈ మూవీలో బన్నీ ధరించిన కాస్ట్యూమ్స్ గురించి చర్చ జరుగుతోంది. పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ సికో పట్టు వస్త్రాలనే అల్లు అర్జున్ ధరించారు. పోచంపల్లిలో ఈ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఆ సమయంలోనే మూవీ యూనిట్ ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేసింది.
సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైపూర్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ షెడ్యూల్‌లో రజినీకాంత్‌తో పాటు ఆమిర్ ఖాన్ పాల్గొన్నట్లు సమాచారం. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
UGC NET-2024 <
AP: కేంద్రం, IIT మద్రాస్ అమలుచేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం SWAYAM రాష్ట్రంలోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాటితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బీటెక్ విద్యార్థులకు 72 రకాల కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ఒక సెమిస్టర్ పాటు శిక్షణ అందించనుంది. వీరికి IIT మద్రాస్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అదనంగా క్రెడిట్లు కూడా ఇస్తుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర చిక్కుల్లో పడ్డారు. ‘గరమ్ ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టేలా తనను మోసగించారని ఢిల్లీ వ్యాపారి సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ‘నిందితులు ఉమ్మడి ఆసక్తితోనే ఫిర్యాదుదారును మోసగించినట్టు రికార్డుల్లోని సాక్ష్యాలు సూచిస్తుండటంతో సమన్లు జారీ చేస్తున్నాం’ అని కోర్టు తెలిపింది.
AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.