news

News December 10, 2024

బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

AP: కేంద్రం, IIT మద్రాస్ అమలుచేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం SWAYAM రాష్ట్రంలోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు వాటితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బీటెక్ విద్యార్థులకు 72 రకాల కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ఒక సెమిస్టర్ పాటు శిక్షణ అందించనుంది. వీరికి IIT మద్రాస్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అదనంగా క్రెడిట్లు కూడా ఇస్తుంది. దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.

News December 10, 2024

చీటింగ్ కేసు: ఫేమస్ యాక్టర్‌కు కోర్టు సమన్లు

image

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర చిక్కుల్లో పడ్డారు. ‘గరమ్ ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో ఢిల్లీ పటియాలా కోర్టు ఆయనతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టేలా తనను మోసగించారని ఢిల్లీ వ్యాపారి సుశీల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ‘నిందితులు ఉమ్మడి ఆసక్తితోనే ఫిర్యాదుదారును మోసగించినట్టు రికార్డుల్లోని సాక్ష్యాలు సూచిస్తుండటంతో సమన్లు జారీ చేస్తున్నాం’ అని కోర్టు తెలిపింది.

News December 10, 2024

FLASH: ఆర్జీవీకి భారీ ఊరట

image

AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆదేశించింది.

News December 10, 2024

షాకింగ్.. రూ.10కోట్ల స్కామ్ చేసిన ప్యూన్!

image

మధ్యప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్యూన్‌గా పనిచేసే బ్రిజేంద్ర దాస్ మరో ఐదుగురితో కలిసి రూ.10కోట్ల స్కామ్‌కు పాల్పడ్డాడు. బ్యాంకుల్లో పనిచేస్తున్న ఇతర నిందితులు బ్రిజేంద్రను డ్రాయింగ్, డిస్బర్సింగ్ ఆఫీసర్‌గా చూపించి, ఫేక్ డాక్యుమెంట్స్‌తో రూ.10కోట్లను అతడి ఖాతాలో జమ చేశారు. ప్రభుత్వ స్కీమ్ కింద భూములు కొనేందుకు ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. బ్రిజేంద్రతో సహా ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 10, 2024

పుష్ప-2 చూస్తూ అభిమాని మృతి

image

AP: అనంతపురం(D) రాయదుర్గంలోని థియేటర్‌లో పుష్ప-2 చూస్తూ మద్దానప్ప(37) అనే అభిమాని మృతి చెందాడు. షో ముగిసిన తర్వాత కూడా అతను సీటులోనే ఉండటంతో ప్రేక్షకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయినట్లు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అయితే మద్దానప్ప తొక్కిసలాటలో మరణించి ఉంటాడనే అనుమానంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

News December 10, 2024

కుమారులతో మోహన్ బాబు చర్చలు

image

హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. <<14837635>>కుటుంబంలో వివాదం<<>> నెలకొన్న నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ చర్చించుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో విష్ణు దుబాయ్ నుంచి ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

News December 10, 2024

పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ మీటింగ్

image

పార్లమెంటులో నేటి సమావేశాల ఆరంభానికి ముందు కాంగ్రెస్ ఎంపీలతో LOP రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీలందరూ ఉభయ సభలకు హాజరవ్వాలని ఆయన సూచించినట్టు తెలిసింది. అయితే సమావేశం అజెండా బయటకు రాలేదు. మీడియా అడిగినప్పటికీ ఆయన స్పందించలేదు. జార్జ్ సొరోస్‌, డీప్‌స్టేట్‌తో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అనుబంధం ఉందంటూ BJP ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

News December 10, 2024

20 మంది భార్యలు.. మత బోధకుడికి 50 ఏళ్ల జైలు

image

అమెరికాకు చెందిన ఓ మత బోధకుడికి కోర్టు 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. FLDS (ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్) మత బోధకుడు శామ్యూల్ బాటెమ్యాన్ 20 మంది మహిళలను చట్టవిరుద్ధంగా భార్యలుగా చేసుకున్నాడు. వీరిలో 11 నుంచి 14 ఏళ్ల బాలికలు కూడా ఉన్నారు. బాలికలను వివిధ దేశాల నుంచి అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పలు కేసుల్లో కోర్టు దోషిగా తేల్చింది.

News December 10, 2024

లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

image

AP: విశాఖ(D) మహారాణిపేట అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు. అతనికి 40రోజుల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ చిన్న జాబ్స్ చేస్తున్నారు. లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్న నరేంద్ర, కొంత డబ్బు తిరిగి చెల్లించాడు. ₹2వేలు బాకీ ఉండటంతో యాప్ నిర్వాహకులు వేధించారు. దీంతో మిగతా ₹2వేలూ చెల్లించాడు. అయినా యాప్ వాళ్లు తన భార్య, కాంటాక్ట్స్‌కు మార్ఫింగ్ ఫొటోలు పంపడంతో ఉరేసుకున్నాడు.

News December 10, 2024

RBI గవర్నర్ శక్తికాంతదాస్ GOODBYE మెసేజ్

image

నేడు పదవిని వీడుతున్నానని RBI గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. తనకీ అవకాశమిచ్చిన PM నరేంద్రమోదీ, FM నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎకానమీని ముందుకు నడిపించడం, ఫిస్కల్ మానిటరీ కోఆర్డినేషన్‌లో వారి గైడెన్స్ ఉపయోగపడిందని చెప్పారు. తమకు ఇన్‌పుట్స్ ఇచ్చిన ఎకానమీ, ఫైనాన్స్ సెక్టార్లోని నిపుణులు, ఆర్థికవేత్తలు, సంఘాలకు థాంక్స్ చెప్పారు. సంక్లిష్ట సమయంలో బాగా పనిచేశామని RBI టీమ్‌కు కితాబిచ్చారు.