News December 10, 2024
లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

AP: విశాఖ(D) మహారాణిపేట అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు. అతనికి 40రోజుల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ చిన్న జాబ్స్ చేస్తున్నారు. లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్న నరేంద్ర, కొంత డబ్బు తిరిగి చెల్లించాడు. ₹2వేలు బాకీ ఉండటంతో యాప్ నిర్వాహకులు వేధించారు. దీంతో మిగతా ₹2వేలూ చెల్లించాడు. అయినా యాప్ వాళ్లు తన భార్య, కాంటాక్ట్స్‌కు మార్ఫింగ్ ఫొటోలు పంపడంతో ఉరేసుకున్నాడు.
Similar News
News November 15, 2025
3 – 20వ వారం వరకు గొర్రె పిల్లలకు ఆహారం

☛ 3- 7 వారాల వరకు తల్లిపాలతో పాటుగా అధిక పోషక విలువలు కలిగి సులువుగా జీర్ణమయ్యే క్రీపు దాణాను.. పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి. ఇలా చేస్తే 7 వారాలకు పిల్లలు కనీసం 12kgల బరువు పెరుగుతాయి.
☛ 8 నుంచి 20వ వారం వరకు పిల్లలకు మేతను T.M.R (టోటల్ మిక్స్‌డ్ రేషన్) రూపంలో అందించాలి. టి.ఎం.ఆర్‌తో పాటుగా గొర్రెలకు పరిశుభ్రమైన తాగు నీటిని అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
News November 15, 2025
బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్, నూడిల్స్, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.


