news

News December 10, 2024

కుమారులతో మోహన్ బాబు చర్చలు

image

హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. <<14837635>>కుటుంబంలో వివాదం<<>> నెలకొన్న నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ చర్చించుకుంటున్నారు. వివాదం నేపథ్యంలో విష్ణు దుబాయ్ నుంచి ఇవాళ హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

News December 10, 2024

పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ మీటింగ్

image

పార్లమెంటులో నేటి సమావేశాల ఆరంభానికి ముందు కాంగ్రెస్ ఎంపీలతో LOP రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీలందరూ ఉభయ సభలకు హాజరవ్వాలని ఆయన సూచించినట్టు తెలిసింది. అయితే సమావేశం అజెండా బయటకు రాలేదు. మీడియా అడిగినప్పటికీ ఆయన స్పందించలేదు. జార్జ్ సొరోస్‌, డీప్‌స్టేట్‌తో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అనుబంధం ఉందంటూ BJP ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

News December 10, 2024

20 మంది భార్యలు.. మత బోధకుడికి 50 ఏళ్ల జైలు

image

అమెరికాకు చెందిన ఓ మత బోధకుడికి కోర్టు 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. FLDS (ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్) మత బోధకుడు శామ్యూల్ బాటెమ్యాన్ 20 మంది మహిళలను చట్టవిరుద్ధంగా భార్యలుగా చేసుకున్నాడు. వీరిలో 11 నుంచి 14 ఏళ్ల బాలికలు కూడా ఉన్నారు. బాలికలను వివిధ దేశాల నుంచి అక్రమంగా రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పలు కేసుల్లో కోర్టు దోషిగా తేల్చింది.

News December 10, 2024

లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

image

AP: విశాఖ(D) మహారాణిపేట అంగటిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు. అతనికి 40రోజుల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ చిన్న జాబ్స్ చేస్తున్నారు. లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్న నరేంద్ర, కొంత డబ్బు తిరిగి చెల్లించాడు. ₹2వేలు బాకీ ఉండటంతో యాప్ నిర్వాహకులు వేధించారు. దీంతో మిగతా ₹2వేలూ చెల్లించాడు. అయినా యాప్ వాళ్లు తన భార్య, కాంటాక్ట్స్‌కు మార్ఫింగ్ ఫొటోలు పంపడంతో ఉరేసుకున్నాడు.

News December 10, 2024

RBI గవర్నర్ శక్తికాంతదాస్ GOODBYE మెసేజ్

image

నేడు పదవిని వీడుతున్నానని RBI గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. తనకీ అవకాశమిచ్చిన PM నరేంద్రమోదీ, FM నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎకానమీని ముందుకు నడిపించడం, ఫిస్కల్ మానిటరీ కోఆర్డినేషన్‌లో వారి గైడెన్స్ ఉపయోగపడిందని చెప్పారు. తమకు ఇన్‌పుట్స్ ఇచ్చిన ఎకానమీ, ఫైనాన్స్ సెక్టార్లోని నిపుణులు, ఆర్థికవేత్తలు, సంఘాలకు థాంక్స్ చెప్పారు. సంక్లిష్ట సమయంలో బాగా పనిచేశామని RBI టీమ్‌కు కితాబిచ్చారు.

News December 10, 2024

CMగా ఉన్నన్నాళ్లూ ఆ పని చేయనివ్వను: స్టాలిన్

image

పదవిలో ఉన్నంత వరకు మదురైలోని మేలూరులో టంగ్‌స్టన్ మైనింగ్‌‌ జరగనివ్వనని TN CM MK స్టాలిన్ అన్నారు. హిందుస్థాన్ జింక్‌కు కేంద్రం మైనింగ్ హక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో DMK ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడారు. ‘ఆందోళన తెలియజేసినప్పటికీ రాష్ట్ర అనుమతి లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం తగదు. 2022లో రాష్ట్రం దీనిని జీవ వైవిధ్య వారసత్వ ప్రాంతంగా గుర్తించింది’ అని తీర్మానంలో పేర్కొన్నారు.

News December 10, 2024

అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం: మోహన్ బాబు

image

ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని మంచు మోహన్ బాబు అన్నారు. తమ కుటుంబంలో చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. దీనిని పరిష్కరించుకుంటాం. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబాల గొడవలు పరిష్కరించా. వారు కలిసేలా చేశా’ అని తెలిపారు. జల్‌పల్లిలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 10, 2024

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.72,050కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరగడంతో రూ.78,600 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.4వేలు పెరిగి రూ.1,04,000కు చేరింది. గత 10 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News December 10, 2024

స్పామ్ కాల్స్‌ బెడద.. తెలుగు స్టేట్స్ టాప్!

image

తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పామ్ కాల్స్ ఇబ్బందిగా మారాయి. ఎయిర్‌టెల్ స్పామ్ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా స్పామ్ కాల్స్ గుర్తించిన రాష్ట్రాల్లో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా పురుషులు(76%), అందులోనూ 36-60 ఏళ్ల మధ్యనున్న వారినే టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ స్పామ్ కాల్స్ రోజూ ఉదయం 11 నుంచి 3PM వరకు వస్తాయని తెలిసింది. వీకెండ్స్‌లో తక్కువగా కాల్స్ వస్తాయని వెల్లడైంది.

News December 10, 2024

పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతున్నారా..

image

పరగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని సేవించడం చాలామందికి అలవాటు. దానిని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కాపర్, అల్యూమినియం గ్లాసుల్లో దీనిని తీసుకోవద్దు. పులుపు ఆ లోహాలను కరిగిస్తుంది. దాంతో అవి రక్తంలో కలవొచ్చు. చర్మ సమస్యలుంటే పుల్లని పానీయాలు తీసుకోవద్దు. ఎసిడిటీ ఉంటే అది మరింత ఎక్కువ కావొచ్చు. లెమన్ వాటర్‌ను వెంటనే తాగకపోతే విటమిన్-సి తగ్గిపోవచ్చు.