India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటక బెళగావి జిల్లాలోని GOVT ఆస్పత్రుల్లో JAN నుంచి 322 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. APR-OCT మధ్య 29 మంది మహిళలు ప్రసవానంతరం చనిపోయారని తెలిపింది. ఈ ఘటనలపై విపక్ష BJP ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక కాంగ్రెస్ మోడల్ అంటే డెత్ ట్రాప్ అని విమర్శించింది. ఆరోగ్య శాఖను కాంగ్రెస్ శ్మశానవాటికగా మార్చిందని, తల్లులు, పిల్లల ప్రాణాలను తీస్తోందని దుయ్యబట్టింది.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయి. గోదావరి నుంచి 4,130, కృష్ణా నుంచి 869, వంశధార నుంచి 21 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ మూడు నదుల నుంచి కేవలం 293 టీఎంసీలను మాత్రమే పంటల సాగుకు ఉపయోగించుకున్నారు. రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వ, వినియోగించుకున్న జలాల కంటే వృథా నాలుగు రెట్లు ఉండటం గమనార్హం.
జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81 కోట్ల మందికి ఉచితం, రాయితీపై రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్రం చెప్పడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక పన్ను చెల్లింపుదారులు మాత్రమే మిగిలి ఉన్నారని అర్థమవుతోందని పేర్కొంది. ఇంకెంత కాలం ఉచితాలు ఇస్తారు? ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేరా? అని ప్రశ్నించింది. వలస కార్మికుల సమస్యలపై నమోదు చేసిన సుమోటో కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
TG: తమను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల మందికి పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నేడు సమ్మెలోకి దిగనున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని గతేడాది CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. 20 ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని వాపోతున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెతో KGBVలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌లోకి భారత సంతతి మహిళను ఎంపిక చేశారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన ఇండో అమెరికన్ లాయర్ హర్మిత్ థిల్లాన్‌ను మానవ హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్ పోస్టుకు నామినేట్ చేశారు. ఇప్పటికే ఆయన తన కార్యవర్గంలోకి భారత మూలాలున్న వివేక్ రామస్వామి, కోల్‌కతాలో జన్మించిన భట్టాచార్య, కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో ఇంటర్ బాలిక ప్రసవం, <<14828392>>బిడ్డను విసిరేయడంపై<<>> రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మండిపడింది. ఈ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపింది. హాస్టల్ పిల్లలపై సిబ్బంది, పేరెంట్స్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందంది.
AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.
AP: సీఎం చంద్రబాబు వచ్చేవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తారని తెలిపారు. జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలవుతాయన్నారు. దానికి సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ పనులు కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావాస పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
AP: రాష్ట్రంలో ప్రస్తుతం 24మంది మంత్రులున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, TDP పొత్తులో భాగంగా జనసేనకు 4, BJPకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ(92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎం, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.