News December 10, 2024

నాగబాబుకు మంత్రి పదవి ఎలా ఖరారైందంటే?

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం 24మంది మంత్రులున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, TDP పొత్తులో భాగంగా జనసేనకు 4, BJPకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Similar News

News January 17, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 17, 2025

భక్తులకు టీటీడీ కీలక సూచనలు

image

AP: నేటితో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ ముగియనుందని భక్తులకు టీటీడీ సూచించింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం క్యూలైన్‌లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.

News January 17, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 17, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.27 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.