India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొన్ని సార్లు విత్ డ్రా చేసినప్పుడు ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆ ఏటీఎం లింక్ అయిన బ్యాంక్‌కు వెళ్లి విత్ డ్రా చేసిన టైం, తేదీ వివరాలతో ఫామ్ నింపితే మంచి నోట్లు ఇస్తారు. అలాగే చిరిగిన, పాడైపోయిన నోట్లనూ ఫామ్ నింపకుండానే మార్చుకోవచ్చు. బ్యాంకులు లేదా రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో ఎలాంటి ఫీజు చెల్లించకుండా గరిష్ఠంగా రూ.5వేల వరకు ఇలా మార్చుకునేందుకు వీలుంది.
AP: రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు CM CBN ప్రకటించడంతో ఒక్కసారిగా నాగబాబు పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తారని భావించినా బీజేపీ కృష్ణయ్య పేరును ప్రకటించింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ తమాషాలు మానుకొని రాహుల్‌ని ప్రజలు ఎందుకు నమ్మట్లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్‌కు హితవు పలికారు. అటు, సోనియా, <<13836410>>జార్జ్ సోరోస్<<>> మధ్య ఆర్థిక బంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కొన్నింటిని రాజకీయ కోణంలో చూడలేమని, దీన్ని కాంగ్రెస్, రాహుల్‌కి సంబంధించిన విషయంగా చూడట్లేదన్నారు. దేశ వ్యతిరేక శక్తులపై కలిసికట్టుగా పోరాడాలన్నారు.
రోహిత్, కోహ్లీ టీమ్‌ఇండియాకు అందించిన సేవలు వెల కట్టలేనివి. కానీ కొన్నాళ్లుగా వీరు టెస్ట్ జట్టుకు భారంగా మారుతున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. BGT 2వ టెస్టుతో సహా కొన్నాళ్లుగా విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కోహ్లీ తొలి టెస్టులో సెంచరీ చేసినా ఆఫ్‌సైడ్ బంతుల్ని వెంటాడి మరీ ఔట్ అవుతున్నారు. జూనియర్లకు ఆదర్శంగా నిలవకుండా జట్టుకు భారంగా మారడం టెస్టు విజయాలపై ప్రభావం చూపే అంశమే. దీనిపై మీ COMMENT.
TG: సోనియాగాంధీ బర్త్ డేను అధికారికంగా జరపడం కోసమా ఈ తతంగమంతా అని CM రేవంత్‌ను KTR ప్రశ్నించారు. ‘ఏటా డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుతారట. మీ కాంగ్రెస్ తల్లి బర్త్ డే కోసం మా తెలంగాణ తల్లిని బలిచేస్తావా? అంత అభిమానం ఉంటే గాంధీ భవన్ లేదా ఢిల్లీలో చేసుకో. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని కోట్లాది గుండెల నుంచి చెరిపేయొచ్చని అనుకోవడం నీ అమాయకత్వం’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.
చలికాలంలో వేధించే చర్మ సమస్యలకు చియా సీడ్స్ చక్కటి పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం తేమను బ్యాలెన్స్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. సాల్మన్ చేపల కంటే వీటిల్లో ఎక్కువగా ఉండే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, ఫ్లూ వంటి వాటిపై కూడా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పోరాడతాయంటున్నారు.
TG: తన తండ్రి మోహన్‌బాబు <<14835430>>ఫిర్యాదు<<>>పై మనోజ్ స్పందించారు. ‘నాతో పాటు నా భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లో మాకు రక్షణగా నిలబడాలని ఇరురాష్ట్రాల CMలను కోరుతున్నా. ఆస్తుల కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు. నేను, నా భార్య సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నాం. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. వివాదాల్లో నా కూతుర్ని కూడా చేర్చడం బాధాకరం’ అని అన్నారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
TG: తాను HYD జల్‌పల్లిలో పదేళ్లుగా ఉంటున్నానని, ఇల్లువదిలి వెళ్లిపోయిన <<14835430>>మనోజ్<<>> 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ CPకి రాసిన లేఖలో మోహన్‌బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా ఆఫీసు సిబ్బందిని 30మందితో బెదిరించాడు. నేను 78ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని. రక్షణ కల్పించండి’ అని రాశారు.
1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
* అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
Sorry, no posts matched your criteria.