news

News February 6, 2025

ఈరోజు మ్యాచ్‌లో విరాట్, రోహిత్ ముంగిట రికార్డులివే

image

నేటి ODI మ్యాచ్‌లో భారత ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 94 రన్స్ చేస్తే విరాట్ వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన ప్లేయర్ అవుతారు. 12 రన్స్ చేస్తే ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడవుతారు. ఇక రోహిత్ 11వేల వన్డే రన్స్ పూర్తి చేయడానికి 134 పరుగుల దూరంలో ఉన్నారు. 24 రన్స్ చేస్తే ODIల్లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ 10లోకి చేరుకుంటారు.

News February 6, 2025

కాంగ్రెస్ అహంకారంతో INDIAకు ఓటములు: SP

image

ఇండియా కూటమిలో మళ్లీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని SP స్పష్టంచేసింది. ఢిల్లీలో Exitpolls ఆప్ ఓటమిని అంచనా వేయడంతో రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అక్కడ బీజేపీ B టీమ్‌లా పనిచేసిందని SP MP రామ్‌గోపాల్ అన్నారు. రాహుల్, ఖర్గే, వాద్రా BJP భాషలో మాట్లాడారని, ఆప్‌ పతనానికి ప్రయత్నించారని విమర్శించారు. అహంకారం వల్లే HAR, MHలో ఓడిపోయారన్నారు.

News February 6, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.

News February 6, 2025

‘లైగర్‌’లో నటించేందుకు అనన్య ఒప్పుకోలేదు: చంకీ పాండే

image

విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు తన కూతురు అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె తండ్రి చంకీ పాండే తెలిపారు. ఆ పాత్రకు ఆమె వయసు సరిపోదని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తానే ఒప్పించినట్లు వెల్లడించారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కరణ్ జోహర్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.

News February 6, 2025

బుమ్రా గాయంపై రోహిత్ UPDATE

image

స్టార్ పేసర్ బుమ్రా గాయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి 2 రోజులు స్కాన్స్ జరగాల్సి ఉందన్నారు. అందులో వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి ఇంగ్లండ్‌తో మూడో వన్డే, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై క్లారిటీ వస్తుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCAలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ENGతో ODI సిరీస్‌కు అతని స్థానంలో వరుణ్‌ను BCCI ఎంపిక చేసింది.

News February 6, 2025

జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం.. TDP సంచలన ట్వీట్

image

AP: లిక్కర్ స్కాంపై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని TDP ప్రశ్నించింది. ‘సిట్ తనవరకు వస్తుందని స్కాంకి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా CC ఫుటేజీ ఎందుకు బయటపెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ట్వీట్ చేసింది.

News February 6, 2025

అందుకే సాయి పల్లవిని ‘తండేల్’కు తీసుకున్నాం: అల్లు అరవింద్

image

తండేల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి వంద శాతం న్యాయం చేశారని నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసింది నేనే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు ఈ పాత్రకు న్యాయం చేయలేరని నాకు అనిపించింది. ఎన్నో భావోద్వేగాల్ని పండించాల్సిన పాత్ర కావడంతో సాయి పల్లవే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నాం. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుంది’ అని కొనియాడారు.

News February 6, 2025

పాక్‌పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి

image

భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్‌గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్‌పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.

News February 6, 2025

Stock Markets: పెరిగిన డిఫెన్సివ్ స్టాక్స్‌

image

స్టాక్‌మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదు. బంగారం, డాలర్ ఇండెక్స్, US బాండ్ యీల్డులు పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. నిఫ్టీ 23,638 (-58), 78,102 (-163) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

News February 6, 2025

సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారు.. వలసదారుల ఆవేదన

image

US నుంచి INDకు చేరుకున్న వలసదారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఉన్నంతసేపు చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారని 36 ఏళ్ల జస్‌పాల్ సింగ్ వాపోయారు. అమృత్‌సర్‌లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వాటిని తీసేశారని చెప్పారు. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లున్న ఫొటోలు వైరల్ కాగా కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కానీ ఆ ఫొటోలు గ్వాటెమాల వలసదారులవని PIB ఫ్యాక్ట్‌‌చెక్ తెలిపింది.