News December 10, 2024

శుభ ముహూర్తం

image

తేది: డిసెంబర్ 10, మంగళవారం
దశమి: రా.3.43 గంటలకు
ఉత్తరాభాద్ర: మ.1.30 గంటలకు
వర్జ్యం: రా.12.39-2.08 గంటల వరకు
దుర్ముహూర్తం: 1)ఉ.8.39-9.24 గంటల వరకు
2)రా.10.43-11.34గంటల వరకు

Similar News

News January 17, 2025

BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

News January 17, 2025

IPL: ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ పటేల్?

image

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. KL రాహుల్, డుప్లెసిస్ వంటి ప్లేయర్లున్నా టీమ్ మేనేజ్‌మెంట్ అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2019 నుంచి DCకి ఆడుతున్న అక్షర్, గత సీజన్‌లో ఆ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. ఒక మ్యాచులో కెప్టెన్సీ కూడా చేశారు. ఇంగ్లండ్‌తో జరిగే T20 సిరీస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండనున్నారు.

News January 17, 2025

‘పుష్ప’ నటుడికి అరుదైన వ్యాధి.. భార్య ఏమందంటే?

image

‘పుష్ప’ నటుడు ఫహాద్ ఫాజిల్ అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ ( ADHD) వ్యాధి సోకినట్లు గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధిపై ఆయన భార్య నజ్రియా స్పందించారు. ‘ఆయన పరిస్థితి అర్థం చేసుకుని నేను కొంచెం ఓపిక పెంచుకున్నాను. అంతకుమించి మా జీవితంలో ఏమీ మారలేదు’ అని తెలిపారు. ఈ వ్యాధి కలిగిన వారు పరధ్యానం, చికాకు, చిన్నవాటికే కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తారు.