news

News December 9, 2024

Stock Market: నష్టపోయిన సూచీలు

image

స్టాక్ మార్కెట్లు సోమ‌వారం న‌ష్టాలు చవిచూశాయి. Sensex 200 పాయింట్ల న‌ష్టంతో 81,508 వ‌ద్ద‌, నిఫ్టీ 58 పాయింట్ల న‌ష్టంతో 24,619 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. మెట‌ల్‌, రియ‌ల్టీ, IT షేర్లు స్వ‌ల్పంగా లాభ‌ప‌డ్డాయి. Sensex 81,400 ప‌రిధిలో, Nifty 24,580 ప‌రిధిలో ఉన్న స‌పోర్ట్ సూచీల భారీ ప‌త‌నాన్ని నిలువ‌రించాయి. Wipro, LT, Sbi Life టాప్ గెయినర్స్. Tata Consum, Hind Unilivr, Tata Motors టాప్ లూజర్స్.

News December 9, 2024

‘పుష్ప-2’: ఫస్టాఫ్‌కు బదులు సెకండాఫ్ ప్రదర్శించారు!

image

‘పుష్ప-2’ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. కేరళలోని కొచ్చిన్‌ సినీపోలిస్‌లో ఫస్టాఫ్‌కు బదులుగా సెకండాఫ్ ప్రదర్శించారని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ తప్పిదాన్ని ఎవరూ గుర్తించలేకపోగా ఎంజాయ్ చేశారని తెలిపాయి. ఇంటర్వెల్ సమయంలో శుభం కార్డు పడటంతో వెంటనే థియేటర్ యాజమాన్యానికి చెప్పి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించాయి.

News December 9, 2024

ద‌మ్ముంటే ముందుకొచ్చి విచారించు.. ఆన్‌లైన్ కేటుగాడికి మ‌హిళ కౌంట‌ర్‌

image

Digital Arrest మోసాలు పెరుగుతున్నాయి. ముంబైకి చెందిన మహిళకు ఓ ఫ్రాడ్‌స్టర్ ఫోన్ చేసి మీ ఆధార్‌ను ఉపయోగించి ఐదుగురు ₹2 కోట్ల మోసానికి పాల్ప‌డ్డారంటూ బెదిరించాడు. బ్యాంకు అకౌంట్ వివ‌రాలు చెప్పాల‌ని ఆ కేటుగాడు కోర‌గా, ‘నువ్వు నిజంగా పోలీసువైతే వ్యక్తిగతంగా వ‌చ్చి విచారించు. ఇలా వీడియో కాల్‌లో కాదు’ అని ఆ మహిళ గ‌ట్టిగా మంద‌లించి ఫోన్ క‌ట్ చేసింది. ఇలాంటి మోసాల‌పై జాగ్ర‌త్త‌గా ఉండండి. Share It.

News December 9, 2024

రోహిత్ శర్మ, షమీ మధ్య తీవ్ర వాగ్వాదం!

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్, స్టార్ పేసర్ మహ్మద్ షమీ గొడవ పడినట్లు నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా బెంగళూరు టెస్టులో ఓటమి అనంతరం NCAలో ఉన్న షమీని రోహిత్ కలిశాడు. తనకు గాయమైందని, పూర్తి ఫిట్‌గా లేనని అంతకుముందు రోహిత్ మీడియాతో చెప్పడంపై షమీ ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది’ అని పేర్కొంది.

News December 9, 2024

మేం దేశభక్తులం, యాంటీ ఇండియాకు వ్యతిరేకం: కాంగ్రెస్

image

BJPవి డార్క్ వెబ్‌కు పరిమితమైన డార్క్ ఫాంటసీస్ అని కాంగ్రెస్ MP కార్తీ చిదంబరం అన్నారు. డీప్‌స్టేట్‌పై వచ్చేవన్నీ కుట్ర సిద్ధాంతాలని కొట్టిపారేశారు. ‘సోనియా గాంధీ, సొరోస్ మధ్య లింక్స్ సీరియస్ మ్యాటర్. దేశ వ్యతిరేక శక్తులపై ఏకమై పోరాడాలి’ అన్న <<14829726>>కిరణ్ రిజిజు<<>>పై మండిపడ్డారు. ‘భారత సమగ్రత, సార్వభౌమత్వానికి మేం కట్టుబడతాం. మేం దేశభక్తులం, జాతీయవాదులం’ అని స్పష్టం చేశారు. SP, RJD MPలూ ఇలాగే స్పందించారు.

News December 9, 2024

చంద్రబాబు, పవన్‌కు థాంక్యూ: బొత్స

image

AP: నాడు-నేడు ద్వారా స్కూళ్లలో YCP చేసిన అభివృద్ధిని చంద్రబాబు, పవన్ ప్రజలకు మరోసారి చూపించారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని, ఈనెల 13న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపించారని, చివరికి ఏం లేదని తేల్చారని పేర్కొన్నారు.

News December 9, 2024

‘పుష్ప-2’ కలెక్షన్స్ సునామీ

image

‘పుష్ప-2’ సినిమా హిందీలో 4 రోజుల్లోనే రూ.291కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రూ.86 కోట్లు వసూలు చేసిందని, హిందీ బెల్ట్‌లో ఒక్క రోజులో ఇంత మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని పేర్కొంది. అత్యంత వేగంగా రూ.290 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు తెలిపింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ $9.4M వసూలు చేసినట్లు ప్రకటించింది.

News December 9, 2024

మైగ్రేన్‌తో గుండెపోటు & స్ట్రోక్: వైద్యులు

image

మారిన జీవనశైలి ఎంతో మందికి మైగ్రేన్ హెడేక్‌ను తెచ్చిపెట్టింది. ప్రపంచంలో 100 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారు. దీనిని నెగ్లెక్ట్ చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గుండెపోటు & స్ట్రోక్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు. ‘మైగ్రేన్ ఉన్న వ్యక్తులకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం ఉంది. 43% హెమరేజిక్ స్ట్రోక్ ప్రమాదం. Migraine with aura వారికి హృదయనాళ మరణ ప్రమాదం ఎక్కువ’ అని పేర్కొంటున్నారు.

News December 9, 2024

సిసోడియా నియోజ‌క‌వ‌ర్గం అవ‌ధ్ ఓజాకు

image

Febలో జ‌ర‌గ‌నున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆప్ 2వ జాబితాను విడుద‌ల చేసింది. ప‌ట్ప‌ర్‌గంజ్ MLA, సీనియ‌ర్ నేత మ‌నీశ్ సిసోడియా ఈసారి జాంగ్‌పురా నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. ఇటీవ‌ల పార్టీలో చేరిన సివిల్స్ కోచింగ్ ఫ్యాక‌ల్టీ అవ‌ధ్ ఓజా ప‌ట్ప‌ర్‌గంజ్ నుంచి పోటీ చేయ‌నున్నారు. మొద‌టి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 20 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన ఆప్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతోంది.

News December 9, 2024

జైపూర్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్‌లోని జైపూర్‌ వెళ్లనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఈనెల 11, 12, 13 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు. కాగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ఇవాళ సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు.