News December 9, 2024
Stock Market: నష్టపోయిన సూచీలు

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలు చవిచూశాయి. Sensex 200 పాయింట్ల నష్టంతో 81,508 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 24,619 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, రియల్టీ, IT షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. Sensex 81,400 పరిధిలో, Nifty 24,580 పరిధిలో ఉన్న సపోర్ట్ సూచీల భారీ పతనాన్ని నిలువరించాయి. Wipro, LT, Sbi Life టాప్ గెయినర్స్. Tata Consum, Hind Unilivr, Tata Motors టాప్ లూజర్స్.
Similar News
News April 17, 2026
హార్ముజ్ ఓపెన్.. చమురు ధరలు క్రాష్

హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఐరోపాకు చెందిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 10.13 డాలర్లు తగ్గి $89.26కు చేరింది. మరోవైపు USకు చెందిన WTI క్రూడ్ $10.45 తగ్గి $84.24కు, UAEకి చెందిన ముర్బాన్ క్రూడ్ 8 డాలర్లు తగ్గి $93.46కు చేరాయి. యుద్ధంతో ఓ దశలో $150కి చేరుతుందనుకున్న చమురు ధర ఇప్పుడు ఈ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది.
News April 17, 2026
GTతో మ్యాచ్.. బ్యాటింగ్ ఎంచుకున్న KKR

అహ్మదాబాద్ వేదికగా GTతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బ్యాటింగ్ ఎంచుకుంది.
GT: గిల్, సుదర్శన్, బట్లర్, సుందర్, ఫిలిప్స్, తెవాటియా, రషీద్, అశోక్ శర్మ, రబాడ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
KKR: సీఫెర్ట్, నరైన్, రహానే, గ్రీన్, రఘువంశీ(w), పావెల్, రింకూ, రమణదీప్, అనుకుల్ రాయ్, వైభవ్, కార్తీక్
News April 17, 2026
మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం: షా

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో స్పష్టం చేశారు. తమకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు జన్మత: లభిస్తాయని, మతమార్పిడులతో రావని అన్నారు. రాజ్యాంగం కూడా మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించదని తెలిపారు. ఓబీసీలకు రాజ్యాధికారం కల్పించిన పార్టీ కూడా తమదేనని పేర్కొన్నారు. కులగణనను తొలి నుంచీ వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు.


