news

News February 5, 2025

చికెన్ తినడానికి భయపడుతున్నారా?

image

APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.

News February 5, 2025

ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

News February 5, 2025

కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం

image

TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.

News February 5, 2025

పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..

image

పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News February 5, 2025

ఏపీలో మిరప బోర్డు కోసం ప్రతిపాదనలు

image

APలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల బోర్డే దేశంలో మిర్చి ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా నిర్వహణ, దేశీయ మార్కెట్, ఎగుమతులు, ప్రోత్సాహకాలు సహా పలు విషయాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. మిర్చి నిల్వ పద్ధతులు, మార్కెట్ లింకేజ్ సహా ఇతర అంశాలపై రైతులు, వ్యాపారులకు ఈ బోర్డే సహాయం అందిస్తోందని వెల్లడించారు.

News February 5, 2025

టెట్ ఫలితాలు వాయిదా

image

TG: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సి ఉండగా, MLC ఎన్నికల కోడ్‌తో వాయిదాపడ్డాయి. తొలుత ప్రకటించాలని భావించినా, టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో(HYD, రంగారెడ్డి, MBNR మినహా) MLC కోడ్ అమల్లో ఉంది.

News February 5, 2025

కుంభమేళాకు ఫ్రీ ట్రైన్, ఫ్రీ ఫుడ్.. ఎక్కడంటే!

image

మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు గోవా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌కు ఉచితంగా ప్రయాణించేందుకు 3 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. Feb 6, 13, 21 తేదీల్లో మడ్గాన్ నుంచి 8AMకు ఇవి బయల్దేరుతాయి. ప్రభుత్వమే ఫ్రీ భోజనం అందిస్తుంది. ప్రయాగకు వెళ్లాక మాత్రం బస, భోజనం భక్తులే చూసుకోవాలి. వెళ్లాక 24 గంటల్లో రిటర్న్ జర్నీ మొదలవుతుంది. మిగతా రాష్ట్రాలూ ఇలాంటి సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

News February 5, 2025

మహా కుంభమేళా: ప్రయాగ్‌రాజ్ చేరుకున్న మోదీ

image

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే హెలీప్యాడ్ వద్దకు వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో మోదీ కుంభమేళా ప్రాంతానికి వెళ్తారు. త్రివేణీ సంగమ స్థలిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అలాగే హిందూ సంఘాలు, సాధుసంతులతో సమావేశమవుతారు.

News February 5, 2025

‘మంగళవారం’కు సీక్వెల్ సిద్ధం?

image

2023లో చిన్న సినిమాగా వచ్చిన మంగళవారం సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. దాని దర్శకుడు అజయ్ భూపతి ఆ మూవీకి సీక్వెల్ తెరక్కించనున్నట్లు తెలుస్తోంది. పాయల్ రాజ్‌పుత్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ నటించొచ్చని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. పూర్తి క్యాస్టింగ్ వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

News February 5, 2025

క్రేజీ రికార్డ్.. దూబే జట్టులో ఉంటే భారత్ గెలుపు పక్కా

image

భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఓ క్రేజీ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. అతను జట్టులో ఉన్న 30 T20లలో IND వరుసగా విజయం సాధించింది. దూబే 2019 నవంబర్ 3న బంగ్లాపై తొలి మ్యాచ్ ఆడగా ఇండియా ఓడిపోయింది. తొలి 5 మ్యాచ్‌లలో జట్టుకు 2 ఓటములు ఎదురయ్యాయి. 2019 డిసెంబర్ 11న విండీస్‌పై గెలుపు నుంచి దూబే టీమ్‌లో ఉన్న ప్రతిసారీ విజయం సొంతమైంది. దీంతో ఇతనిది లక్కీ జాతకమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.