News February 5, 2025
కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం

TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.
Similar News
News February 9, 2025
సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.
News February 9, 2025
గిల్ ఉంటే రో‘హిట్’

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్‌తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.
News February 9, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు

ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ, మంజీందర్ సింగ్, ఆశిష్ సూద్‌తో వీరు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా సీఎం ఎంపికలో రచించిన వ్యూహాన్ని అనుసరించే అవకాశమున్నట్లు సమాచారం.