news

News August 23, 2024

VD12 టీజర్‌కు NBK లేదా NTR వాయిస్ ఓవర్?

image

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఈ మూవీ టైటిల్ టీజర్‌కు బాలకృష్ణ లేదా ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్ చెప్పించుకోవాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. VD12 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

News August 23, 2024

పెట్టుబడి రూ.10 లక్షలు – లాభం రూ.4.46 కోట్లు

image

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. 2004, ఆగస్టులో మొదలైన ఈ స్కీమ్ 21.02% CAGRతో అదరగొట్టింది. 20 ఏళ్ల క్రితం ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఇప్పుడు రూ.4.56 కోట్లు చేతికందాయి. ఇదే సమయంలో నిఫ్టీ 16.2% CAGRతో రూ.2 కోట్లే అందించింది. ఇక ఆరంభం నుంచీ నెలకు రూ.10వేలు సిప్ చేస్తే XIRR 19.41%తో ఆ విలువ రూ.2.30 కోట్లకు పెరిగేది.

News August 23, 2024

షకిబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు!

image

బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు నమోదైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న తన కుమారుడిని(రుబెల్‌) Aug 7న హత్య చేశారంటూ అతడి తండ్రి రఫికుల్ ఫిర్యాదు చేశారు. మొత్తం 154మందిపై ఫిర్యాదు చేయగా అందులో అవామీ లీగ్ పార్టీ మాజీ MP అయిన షకిబ్‌‌పైనా కేసు నమోదైనట్లు సమాచారం. ఇదే ఫిర్యాదులో మాజీ PM హసీనా పేరున్నట్లు వార్తలొస్తున్నాయి.

News August 23, 2024

థాంక్యూ డియర్ బన్నీ: చిరంజీవి

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపిన విషెస్‌కు మెగాస్టార్ చిరంజీవి రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ డియర్ బన్నీ’ అంటూ చిరు కామెంట్ చేశారు. బర్త్ డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, భట్టి విక్రమార్క, లోకేశ్, కేటీఆర్, గంటా శ్రీనివాసరావు, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌, NTR, మోహన్ లాల్‌కు మెగాస్టార్ రిప్లై ఇచ్చారు.

News August 23, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

image

AP: వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. ‘గ్రామాల్లో 10వేల కి.మీ సిమెంట్ డ్రెయిన్లు వేస్తాం. రైతులు పశువుల షెడ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తాం. పేదలకు ఇళ్లు కట్టించి, విద్యుత్, సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటాం. పంచాయతీల అభివృద్ధికి ఇటీవలే రూ.990కోట్లు విడుదల చేశాం. త్వరలో మరో రూ.1100కోట్లు రిలీజ్ చేస్తాం’ అని వానపల్లి గ్రామసభలో CM అన్నారు.

News August 23, 2024

84 లక్షల కుటుంబాలకు పని లభిస్తుంది: సీఎం

image

AP: ఈ ఏడాది నరేగా కింద రూ.4500 కోట్ల పనులకు అనుమతి తీసుకున్నామని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు తెలిపారు. 84 లక్షల కుటుంబాలకు పని లభిస్తుందన్నారు. ఏడాదిలో 100 రోజుల పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 2014-19 మధ్య గ్రామాభివృద్ధికి స్వర్ణయుగంగా మారితే వైసీపీ హయాంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని సీఎం ఆరోపించారు.

News August 23, 2024

హేమపై ‘మా’ సస్పెన్షన్ ఎత్తివేత

image

సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) సస్పెన్షన్ ఎత్తివేసింది. అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో ‘మా’ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియాతో మాట్లాడొద్దని ఆమెను ఆదేశించింది. కాగా కొన్నినెలల కిందట బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొని, డ్రగ్స్ తీసుకున్నట్లు అక్కడి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

News August 23, 2024

BNSS 479 పెండింగ్ కేసులకూ వర్తిస్తుంది: కోర్టుతో కేంద్రం

image

CRPC 436Aను భర్తీచేసిన BNSS 479.. 2024, జులై 1కి ముందు నమోదైన కేసులకూ వర్తిస్తుందని కోర్టుకు కేంద్రం తెలిపింది. 2021 అక్టోబర్ నుంచి జైళ్లు కిక్కిరిసిపోవడంతో కోర్టు దీనిని సుమోటోగా తీసుకుంది. 479 ప్రకారం నేరానికి పడే శిక్షాకాలంలో మూడో వంతు అనుభవిస్తే తొలిసారి తప్పుచేసిన ఖైదీలకు ఉపశమనం కల్పించొచ్చు. దీంతో అండర్ ట్రయల్స్ దరఖాస్తులు క్లియర్ చేయాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను కోర్టు ఆదేశించింది.

News August 23, 2024

ట్రోల్స్.. ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసిన అయేషా

image

తనపై ట్రోల్స్‌ వస్తున్న నేపథ్యంలో నటి అయేషా టాకియా ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు. నీలిరంగు చీరతో ఒక ఫొటోను ఇన్‌స్టాలో <<13916734>>పోస్టు<<>> చేయగా దానిపై భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. ‘అందంగా ఉన్నారు. కానీ నేచురల్ బ్యూటీనే బెస్ట్’ వంటి కామెంట్స్ ఎక్కువగా కనిపించాయి. ఆ తర్వాత ఆమె తన అకౌంట్‌ డిలీట్ చేశారు. మారిన రూపురేఖల కారణంగా అయేషా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులోనూ తనిఖీల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News August 23, 2024

Stock Market: ఆఖరి సెషన్లో అంతంత మాత్రమే

image

ఈ వారం ఆఖరి సెషన్లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. 81,165 వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 81,086 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 24,823 వద్ద క్లోజైంది. నిఫ్టీలో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టపోయాయి. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, విప్రో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్ నష్టపోయాయి.

error: Content is protected !!