News February 5, 2025

రూ.86వేలు దాటిన తులం బంగారం

image

బంగారం ధరలు మండిపోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.79,050లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరగడంతో రూ.86,240 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News February 18, 2025

రేపటి నుంచే మెగా టోర్నీ.. గెలిచేదెవరో?

image

రేపటి నుంచి మార్చి 9 వరకు మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

News February 18, 2025

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.

News February 18, 2025

SHOCKING.. కుంభమేళాలో నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా

image

కుంభమేళా వేళ గంగా నదిలో నీటి నాణ్యతపై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆందోళన రేకెత్తించే అంశాలను వెల్లడించారు. ఈ నీళ్లలో చర్మానికి హానిచేసే కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని NGTకి తెలిపింది. ప్రతి 100mm నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే స్నానం చేయవచ్చని CPCB చెబుతోంది. కాగా దీనిపై విచారణను NGT రేపటికి వాయిదా వేసింది.

error: Content is protected !!