India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

AP: ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సరికొత్త విధానాలతో ప్రభుత్వ ఆదాయం పెంచాలని, పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. వ్యాపారులను వేధించవద్దని అధికారులకు సూచించారు. ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

తమ దేశంలోని అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరిపై దాదాపు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మామూలు విమానాల్లో టికెట్ ధర 853 డాలర్లు ఉండగా, ఇందుకు 5 రెట్లు వెచ్చిస్తోంది. వలసదారులందరినీ సీ-17, సీ-130ఈ మిలటరీ విమానాల్లోనే వారి దేశాలకు తరలిస్తోంది. ఈ విమానాల నిర్వహణకు గంటకు దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం.

యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన అభిమానులను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని అనుమతులు తీసుకొని ఈవెంట్ నిర్వహించడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఓర్పుతో ఉండాలని కోరింది. అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

TG: 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు.
*గ్రూప్-1లోని 15 ఉపకులాలకు (3.288% జనాభా) 1 శాతం రిజర్వేషన్
*గ్రూప్-2లోని 18 ఉపకులాలకు (62.748% జనాభా) 9 శాతం
*గ్రూప్-3లోని 26 ఉపకులాలకు (33.963% జనాభా) 5 శాతం
*క్రిమీలేయర్ అమలు చేయాలని సిఫారసు చేసిందని కానీ క్యాబినెట్ దాన్ని తిరస్కరించిందని సీఎం తెలిపారు.

ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన NCAలో ఉన్నారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.

IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్‌ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాము అధికారంలోకి రాకముందు LED బల్బుల రేటు రూ.400గా ఉండేదని, దాన్ని తాము రూ.40కి తగ్గించామని పీఎం మోదీ చెప్పారు. LED బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని, దీనివల్ల భారతీయులకు రూ.20వేల కోట్లు సేవ్ అయ్యాయని వెల్లడించారు. తాము మంచి చేస్తున్నాం కాబట్టే మళ్లీ మళ్లీ గెలుస్తున్నామని వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతారు కానీ దాన్ని అర్థం చేసుకోరని రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.

అధికారిక వెబ్‌సైట్‌లోని ‘కుటుంబ సర్వే’ తప్పుల తడకగా ఉందని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఆ PDFను డిలీట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇది అందుబాటులో లేదని BRS నేత క్రిశాంక్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ.. ‘చాలా బాగా చేశారు. అద్భుతమైన ప్రదర్శన’ అంటూ సెటైర్లు వేశారు.

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కలేదు. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్-10లో చోటు దక్కింది. భారత్ 12వ స్థానంలో ఉంది.
Sorry, no posts matched your criteria.