News February 4, 2025

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపాలని నిర్ణయం

image

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News April 17, 2026

VIRAL: ఇన్‌ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్

image

ఇన్‌స్టాలో జర్మనీ ఇన్‌ఫ్లుయెన్సర్ Lizlaz బోల్డ్ ఫొటోకు కింగ్ కోహ్లీ లైక్ కొట్టడం SMలో వైరల్‌గా మారింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేక అల్గారిథమ్ కారణంగానా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అల్గారిథమ్ వల్లేనని స్పిన్నర్ చాహల్ కామెంట్ చేయడం గమనార్హం. ఇక గతంలోనూ బాలీవుడ్ నటి అవ్‌నీత్ కౌర్ ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టడం నెట్టింట వైరల్ కాగా అందుకు అల్గారిథమే కారణమని విరాట్ తర్వాత క్లారిటీ ఇచ్చారు.

News April 17, 2026

గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని మృతి

image

TG: మాంసం ముక్క వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్‌నగర్(D)లో జరిగింది. మూసాపేట(M) సంకలమద్దికి చెందిన అంజి(35) నిన్న రాత్రి కందూర్ స్టేజి వద్ద హోటల్లో బిర్యానీ తింటుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చనిపోగా అతనితో ఉన్న స్నేహితులు భయంతో డెడ్‌బాడీని వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఇటీవల మహబూబాబాబ్(D)లోనూ ఓ వ్యక్తి ఇలాగే చనిపోయాడు.