India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎవరైనా మరణిస్తే ఆరోజో, మరుసటి రోజో అంత్యక్రియలు పూర్తి చేస్తుంటారు. కానీ, ఇండోనేషియాలోని టోరజా జాతి ప్రజలు దీనికి విరుద్ధం. టోరజాన్ల అంత్యక్రియలు, తదుపరి ఆచారాల కోసం రూ.లక్షలు ఖర్చవుతుంది. డబ్బు లేకపోతే, సమకూర్చేవరకూ మృతదేహాలను లేపనం పూసి ఏళ్లతరబడి ఇంట్లోనే ఉంచుతారు. 12 రోజులపాటు జరిగే ఈ అంత్యక్రియల్లో డజన్ల కొద్దీ గేదెలు, వందల కొద్దీ పందులను బలిస్తారు. అలా చేయకపోతే వారి ఆత్మ శాంతించదని నమ్మకం.
‘స్త్రీ-2’ సినిమా విడుదల తర్వాత శ్రద్ధా కపూర్‌కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 91.5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీని వెనక్కి నెట్టారు. మోదీ 91.3 మిలియన్లతో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నాలుగవ ఇండియన్‌గా నిలిచారు. శ్రద్ధ మూడో ప్లేస్‌లో ఉండగా రెండో స్థానంలో ప్రియాంకా చోప్రా (91.8M), ప్రథమ స్థానంలో కోహ్లీ (271M) ఉన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్నారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ విమర్శించారు. ఆయన టీడీపీలో చేరడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం తప్ప ఆయన జాతి కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నా ఆ పార్టీ అగ్రనేతలకు బాధ ఎందుకన్నారు. దీనిపై త్వరలోనే రాహుల్, ఖర్గేను నిలదీస్తామని చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొందరు అథ్లెట్ల బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా విలువ 30-40% వృద్ధిరేటుతో రూ.330 కోట్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2 పతకాలు అందుకున్న మనూ భాకర్ విలువ 6 రెట్లు పెరిగింది. గతంలో ఒక్కో డీల్‌కు రూ.25 లక్షలు తీసుకొనే ఆమె తాజాగా థమ్స్‌అప్‌తో రూ.1.5 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. వినేశ్ ఫొగట్ రూ.75 లక్షల నుంచి కోటి వరకు తీసుకుంటున్నారు.
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. రాజకీయ కక్షసాధింపులకు కోర్టులను వేదికగా చేసుకోవద్దని జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ARKను మందలించింది.
AP: ఇప్పటికీ విశాఖ రాజధాని అనేది తమ పార్టీ విధానమని YCP MLC బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శాసనమండలిలో ఛైర్మన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ‘పార్టీలో ఒడుదొడుకులు సహజం. ఆందోళన వద్దు. పార్టీలోకి కొత్త నీరు వస్తుంది. పాత నీరు పోతుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. YCP నేతలపై దాడులు ఆపాలి. మా పాలనపై ఏ విచారణకైనా సిద్ధం. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి’ అని డిమాండ్ చేశారు.
తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ‘మహారాజ’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రం (18.6M వ్యూస్)గా నిలిచింది. దీని తర్వాత Crew (17.9M) & లాపతా లేడీస్ (17.1M) ఉన్నాయి.
AP: వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం జగన్‌కు ఇరిగేషన్‌పై అవగాహన లేదని మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. YCP పాలనలో రైతులు నాశనమయ్యారన్నారు. రెండేళ్ల క్రితం వరదలకు సోమశిల దెబ్బతిన్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం సోమశిలకు పూర్వవైభవం తీసుకొస్తుందని చెప్పారు.
AP: జగన్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్ పఫ్‌ల కోసం రూ.3.6 కోట్ల ఖర్చు చేశారన్న ఓ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ట్వీట్‌పై వైసీపీ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేని వదంతులను నమ్మడం బాధాకరమని పేర్కొంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు తెలుసుకుని న్యూస్ వేయాలని హితవు పలికింది.
కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి భద్రతను కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. CISF సీనియర్ అధికారులు ఉదయమే ఆస్పత్రిని సందర్శించారు. పరిస్థితులను సమీక్షించారు. ‘మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. పైవాళ్లు అప్పగించిన పని కోసం మేమిక్కడికి వచ్చాం. దాన్ని పూర్తిచేయనివ్వండి. అత్యున్నత అధికారులు మీకు మరిన్ని వివరాలు చెబుతారు’ అని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి కే ప్రతాప్ సింగ్ మీడియాకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.