News August 21, 2024

ఎస్సీ వర్గీకరణపై వారిని నిలదీస్తాం: మందకృష్ణ

image

మాజీ ఎంపీ హర్షకుమార్ ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్నారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ విమర్శించారు. ఆయన టీడీపీలో చేరడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం తప్ప ఆయన జాతి కోసం చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నా ఆ పార్టీ అగ్రనేతలకు బాధ ఎందుకన్నారు. దీనిపై త్వరలోనే రాహుల్, ఖర్గేను నిలదీస్తామని చెప్పారు.

Similar News

News September 13, 2024

బెండనీటితో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!

image

రాత్రంతా బెండకాయలు నానబెట్టిన నీరు తాగితే బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించగలదు. వేగంగా కలిసిపోయే ఫైబర్ వల్ల డైజెషన్ మెరుగవుతుంది. పొట్ట, బరువు తగ్గేందుకు సాయపడుతుంది. యాంటీ యాక్సిడెంట్లతో కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం బాగుంటుంది. విటమిన్ ఏ, సీ వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి చర్మం నిగారిస్తుంది.

News September 13, 2024

సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ బ్యాటింగ్.. 7 బంతుల్లో డకౌట్

image

అసలే సెలక్టర్లు కోపంతో ఉన్నారని వార్తలు. దీనికి తోడు ఫామ్‌లేమి. పైగా సన్‌గ్లాసెస్ ధరించి క్రీజులోకి వచ్చారు. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడారా అంటే అదీ లేదు. జస్ట్ 7 బంతులాడి డకౌటయ్యారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-డి తరఫున శ్రేయస్ అయ్యర్ తాజా ప్రదర్శన తీరిది. ఇంకేముందీ నెటిజన్లు రంగంలోకి దిగి ట్రోలింగ్ మొదలెట్టారు. సైట్ ఇష్యూస్ ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకుంటారు గానీ సన్‌గ్లాసెస్ కాదు.

News September 13, 2024

ఈ వివాదానికి రేవంతే కారణం: హరీశ్ రావు

image

TG: కౌశిక్ రెడ్డి-గాంధీ వివాదానికి ముఖ్య కారకుడు CM రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘CM బజారు మాటలు మాట్లాడుతున్నారు. ఆయనలాగే గాంధీ, దానం వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ వివాదం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే కొట్టాలని మంత్రి కోమటిరెడ్డి చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఈ మొత్తం వివాదం రేవంత్ డైరెక్షన్‌లోనే జరుగుతోంది’ అని మండిపడ్డారు.