news

News August 21, 2024

హత్యాచారానికి ముందు రెడ్‌లైట్ ఏరియాకు నిందితుడు?

image

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్, దారుణానికి ఒడిగట్టే ముందు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 8న రాత్రి మద్యం సేవించిన రాయ్, RG కర్‌కు చెందిన మరో వాలంటీర్‌తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు. తెల్లవారుజామున ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢనిద్రలో ఉన్న బాధితురాలిని చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు.

News August 21, 2024

RBI గవర్నర్ శక్తికాంత దాస్‌కు మళ్లీ ‘A+’

image

RBI గవర్నర్ శక్తికాంత దాస్‌కు గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2024 మరోసారి ‘A+’ రేటింగ్ ఇచ్చింది. గత ఏడాది కూడా ఆయనకు ఇదే గ్రేడ్ దక్కింది. ఈ సందర్భంగా దాస్‌ను PM మోదీ, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అభినందించారు. దాదాపు 100 దేశాల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లకు మాంద్యం నియంత్రణ, ఆర్థిక వృద్ధి వంటి వాటి ఆధారంగా గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ 1994 నుంచి గ్రేడ్స్ ఇస్తోంది.

News August 21, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/Quiz.jsp?id=338&langid=1&token={TOKEN}

News August 21, 2024

బీటెక్ విద్యార్థులకు నేటి నుంచి స్లైడింగ్

image

TG: కన్వీనర్ కోటాలో బీటెక్ సీట్లు పొంది కాలేజీల్లో చేరిన విద్యార్థులు తమ శాఖను మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ విండో ఓపెన్ అయింది. బ్రాంచి మారినప్పటికీ బోధనా రుసుము అందుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి ఖాళీ సీట్ల తుది జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నాయి. మధ్యాహ్నం రెండింటి నుంచి రేపటి వరకు ఆప్షన్ల నమోదు, ఈ నెల 24న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపాయి.

News August 21, 2024

ఒకే ట్రిమ్మర్ ఎక్కువ మంది వాడుతున్నారా?

image

సెలూన్లు, బ్యాచిలర్ రూంలలో ఒకే ట్రిమ్మర్ చాలా మంది వాడుతారు. దీంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముందు ట్రిమ్మర్ వాడిన వ్యక్తికి HIV, హెపటైటిస్ (B, C), పింపుల్స్, చర్మ వ్యాధులు ఉంటే రెండో వ్యక్తికీ వచ్చే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ట్రిమ్మర్ వాడాల్సి వస్తే బ్లేడ్‌ను తప్పకుండా వేడినీటిలో వాష్ చేయాలని, కొన్నిగంటల గ్యాప్ ఇచ్చి వాడాలని సూచిస్తున్నారు.

News August 21, 2024

అప్పటి SC రిజర్వేషన్ల కోటా ఇలా..!

image

1996లో సీఎం చంద్రబాబు ఎస్సీల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని కమిషన్ ఏర్పాటు చేశారు. ఎస్సీలకు అందుతున్న 15% రిజర్వేషన్లను A, B, C, Dగా వర్గీకరిస్తూ జీవో ఇచ్చారు. A గ్రూపులో రెల్లి సహా 12 కులాలను కలుపుతూ 1%, మాదిగ, దాని 18 ఉపకులాలను Bలో చేర్చి 7%, C గ్రూపులోని మాల, ఉపకులాలకు 6%, D గ్రూపులోని ఆంధ్రులు, మిగతా 4 కులాలకు 1% కోటా అమలు చేశారు. దీనిపై కోర్టులో అభ్యంతరం తెలపడంతో ఆగిపోయింది.

News August 21, 2024

దారుణం: బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్

image

విద్యార్థులకు సన్మార్గం చూపాల్సిన గురువే కామాంధుడిలా మారారు. బాలికలకు అశ్లీల వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని కజిఖేడ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రమోద్ సర్దార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 21, 2024

ఎస్సీ వర్గీకరణపై మీ అభిప్రాయం?

image

ఏపీ, తెలంగాణకు చెందిన ఎస్సీల్లో మాలలు, మాదిగలు, రెల్లి లాంటి 57 ఉపకులాలు ఉన్నాయి. జనాభాలో తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారనేది మాదిగల ఆవేదన. ఎస్సీలను A, B, C, D వర్గాలుగా విభజించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. అయితే వర్గీకరణతో తాము రిజర్వేషన్లు కోల్పోతామని మాలలు మండిపడుతున్నారు. మరి వర్గీకరణ న్యాయమా? కాదా? కామెంట్ చేయండి.

News August 21, 2024

స్కూళ్లు బంద్ అంటూ మెసేజులు

image

భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు అంటూ తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పుడు మెసేజులు పంపుతున్నాయి. దీంతో స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన వారితో పాటు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. టీచర్లు మాత్రం పాఠశాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. అటు బీఎస్పీ సహా వివిధ దళిత సంఘాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు డిపోల వద్ద ఆందోళన చేయడంతో బస్సులు నిలిచిపోయాయి.

News August 21, 2024

అలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో చూడలేదు: షాహీన్ అఫ్రీది

image

టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీది కొనియాడారు. ‘నా కెరీర్ మొత్తంలో అలాంటి ఇన్నింగ్స్ చూడలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, తొలుత పాక్ 159 రన్స్ చేయగా విరాట్ 53 బంతుల్లో 82 రన్స్ చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించారు.

error: Content is protected !!