news

News February 4, 2025

పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

image

AP: YCP అధినేత YS జగన్ ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాలా? వద్దా? అని అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ అనంతరం YCP భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

News February 4, 2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం: CM

image

TG: బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి BRS, BJPలకు సవాల్ విసిరారు. ‘చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని BRS, BJPకి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు.

News February 4, 2025

తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం: షర్మిల

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఆ పార్టీ AP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు తీయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

News February 4, 2025

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి?

image

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కోసం టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బ్యాకప్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో వరుణ్ కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీనిపై త్వరలోనే BCCI నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లతో చెలరేగడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని డిమాండ్లు వచ్చాయి.

News February 4, 2025

జాక్వెస్ లాంటి ఆటగాడిని చూడలేదు: పాంటింగ్

image

సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్‌ కలీస్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఆడిన ఆటగాళ్లలో కలీస్ ఉత్తమ క్రికెటర్ అన్నారు. టెస్ట్‌ ఫార్మాట్లో 45కుపైగా సెంచరీలు 290కి పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడన్నారు. కలీస్ రికార్డులన్నీ చూస్తే ఆయన క్రికెట్ కోసమే పుట్టినట్టు అనిపిస్తుందని పాంటింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు

News February 4, 2025

హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా?: MLA పాయల్ శంకర్

image

TG: బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు లేని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

News February 4, 2025

అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం జరిగింది. పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ ఛైర్మన్‌గా కూన రవికుమార్‌లను నియమిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు.

News February 4, 2025

బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం: తలసాని

image

TG: కులగణన సర్వే ద్వారా BCలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో 30 శాతం మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ‘ఈ సర్వే ప్రకారం BC, SC, ST జనాభా తగ్గినట్లు కనిపిస్తోంది. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సర్వే చేసి తీర్మానం చేస్తే సరిపోదు. ఇలాంటివాటికి చట్టబద్ధత కల్పించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News February 4, 2025

Stock Markets పరుగులు: ఇన్వెస్టర్లకు రూ.7లక్షల కోట్ల ప్రాఫిట్

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,739 (+378), సెన్సెక్స్ 78,538 (+1397) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లు దుమ్మురేపాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌టీ, బీఈఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరోమోటో, నెస్లే ఇండియా టాప్ లూజర్స్. నేడు ఇన్వెస్టర్లు రూ.7లక్షల కోట్లు ఆర్జించారు.

News February 4, 2025

ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్‌నాథ్

image

దేశ భద్రతపై రాహుల్‌గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.