News August 20, 2024
జగన్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
AP: సెప్టెంబర్‌లో యూకే వెళ్లేందుకు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. అటు సెప్టెంబర్, అక్టోబర్‌లో యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం పిటిషన్ వేశారు. విచారణను సీబీఐ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
Similar News
News September 19, 2024
ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
News September 19, 2024
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దుష్ప్రచారం: వైవీ సుబ్బారెడ్డి
AP: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం <<14134836>>వ్యాఖ్యలను<<>> టీటీడీ మాజీ ఛైర్మెన్ సుబ్బారెడ్డి ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని పునరుద్ఘాటించారు. లడ్డూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
News September 19, 2024
ఆ విషయంలో మాది కూడా కాంగ్రెస్-ఎన్సీ వైఖరే: పాక్ మంత్రి
JKలో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో తాము కూడా కాంగ్రెస్-ఎన్సీ వైఖరితోనే ఉన్నామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. JKలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఆర్టికల్ 370, 35A పునరుద్ధరణలో వారిది, తమది ఒకే వైఖరి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్కడా ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని చెప్పలేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండడం గమనార్హం.