news

News August 20, 2024

22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

image

TG: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. 40శాతం మందికి రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులందరికీ తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

News August 20, 2024

అందుకే విగ్రహ వివాదానికి తెరలేపారు: బండి

image

TG: రుణమాఫీపై చర్చను పక్కదారి పట్టించేందుకే విగ్రహాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని రేవంత్ అంటే.. తమ ప్రభుత్వం వచ్చాక KTR తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్, BRS కూడబలుక్కునే ఈ వివాదానికి తెరలేపాయి. ప్రజలు ఆలోచించాలి. ఆరు గ్యారంటీలపైనే రాష్ట్రంలో చర్చ జరగాలి. ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు.. హామీల అమలు’ అని అన్నారు.

News August 20, 2024

హరియాణా ఎన్నికల్లో వినేశ్ పోటీ?

image

ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు అధిక బరువుతో అనర్హత వేటుపడ్డ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రాజకీయాల్లోకి వస్తారని వినికిడి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పారని IANS తెలిపింది. ఆమెతో పాటు భజరంగ్ పునియా సైతం రాజకీయ రణరంగంలోకి రావొచ్చని వెల్లడించింది. బబితా ఫొగట్‌ (బీజేపీ)పై వినేశ్, యోగేశ్వర్ దత్‌ (బీజేపీ)పై భజరంగ్ పోటీని కొట్టిపారేయలేమని పేర్కొంది.

News August 20, 2024

వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మూర్తి

image

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, అతని భార్య శ్రీవాణి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని జర్నలిస్టు మూర్తి పోలీసులను ఆశ్రయించారు. తాను రూ.5 కోట్లు డిమాండ్ చేశానని ప్రకటన చేయడంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన X వేదికగా తెలిపారు. వేణుస్వామి చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని ఆయన స్పష్టం చేశారు. నిజాలేంటో త్వరలోనే బహిర్గతమవుతాయన్నారు.

News August 20, 2024

ఇవి చెక్ చేస్తే హోటల్‌లో సేఫ్‌గా ఉండొచ్చు!

image

హోటల్‌లో ఉన్నప్పుడు సీక్రెట్ కెమెరాలు ఉంటే ఇలా తెలుసుకోండి. అనుమానాస్పద వస్తువులు, అద్దాలు చెక్ చేయండి. అద్దంపై వేలు పెడితే టచ్ అయినట్లు ఉండొద్దు. దాచిన కెమెరాలను చీకట్లో మెరిసే, లేదా LED లైట్లను టార్చ్ ద్వారా గుర్తించొచ్చు. ఇంటర్నెట్‌తో పనిచేసే కెమెరాలను WIFI ఆన్ చేసి స్కాన్ చేస్తే తెలుస్తాయి. కెమెరాకు దగ్గర్లో ఫోన్ మాట్లాడితే కాల్‌కు అంతరాయం కలిగిస్తాయి. డిటెక్టర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

News August 20, 2024

ఈ నెల 23 నుంచి గ్రామ సభలు

image

AP: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు సీఎంకు పవన్ వివరించారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైనా చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

News August 20, 2024

స్కూళ్లకు సెలవులపై మంత్రి కీలక ఆదేశాలు

image

TG: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లే తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా పలు ప్రైవేటు స్కూళ్లకు హాలిడే ఇచ్చారు.

News August 20, 2024

‘వెట్టయన్‌’ నుంచి త్వరలో రాకింగ్ సాంగ్

image

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞాన్‌వేల్ తెరకెక్కిస్తోన్న ‘వెట్టయన్‌’ సినిమా నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. సినిమాలోని ‘మనసిలాయో’ సాంగ్‌ విడుదలవనుందని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేర్కొన్నారు. తలైవా హార్డ్ కోర్ ఫ్యాన్ అనిరుధ్ నుంచి మరో రాకింగ్ ఆంథమ్ లోడ్ అవుతోందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో ‘హుకుమ్’ సాంగ్ రాబోతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News August 20, 2024

RR: 5,924 రోజులుగా నిరీక్షణ!

image

IPL ట్రోఫీని గెలిచేందుకు అన్ని టీమ్స్ శాయశక్తులా కష్టపడతాయి. కానీ, చివరికి ఒక్క జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అయితే ఓసారి కప్ గెలిచిన టీమ్ మరోసారి దాన్ని నెగ్గడం అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. 2008లో తొలిసారి IPL ట్రోఫీ నెగ్గిన RR మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు 5,924 రోజులుగా ఎదురుచూస్తోంది. అటు SRH 2016లో గెలవగా 3005 రోజులుగా మరో ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. MI కూడా కప్ గెలిచి 1379 రోజులైంది.

News August 20, 2024

రాహుల్ పౌరసత్వంపై కోర్టులో విచారణ

image

రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌ను PIL కింద విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సెప్టెంబర్ 26న రోస్టర్ బెంచ్‌కు పంపిస్తామంది. తాను బ్రిటిష్ పౌరుడినని RG స్వచ్ఛందంగా ధ్రువీకరించారని, ఆయన వద్ద బ్రిటన్ పాస్‌పోర్ట్ ఉందని 2019, ఆగస్టు 6న కేంద్ర హోం శాఖకు స్వామి ఫిర్యాదు చేశారు. RG స్పందనేంటో, తీసుకున్న చర్యలేంటో చెప్పేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రస్తుతం కోర్టును కోరారు.

error: Content is protected !!