News August 20, 2024
అందుకే విగ్రహ వివాదానికి తెరలేపారు: బండి
TG: రుణమాఫీపై చర్చను పక్కదారి పట్టించేందుకే విగ్రహాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని రేవంత్ అంటే.. తమ ప్రభుత్వం వచ్చాక KTR తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్, BRS కూడబలుక్కునే ఈ వివాదానికి తెరలేపాయి. ప్రజలు ఆలోచించాలి. ఆరు గ్యారంటీలపైనే రాష్ట్రంలో చర్చ జరగాలి. ప్రజలకు కావాల్సింది విగ్రహాలు కాదు.. హామీల అమలు’ అని అన్నారు.
Similar News
News September 15, 2024
రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్‌లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
News September 15, 2024
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
TG: PMFBY కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
News September 15, 2024
మా ఆర్థిక కష్టాలు తాత్కాలికమే: మాల్దీవులు
తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్యాకేజీకి మాల్దీవులు యత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్రదేశాలు తమకున్నాయని, IMF గురించి ఆలోచించడం లేదని మూసా స్పష్టం చేశారు.