India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలో కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు <<13890531>>చనిపోయిన<<>> ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
<<13891437>>కోల్‌కతాలో<<>> హత్యాచారానికి గురైన తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వెంటనే దహనం చేయడాన్ని బాధితురాలి తండ్రి ప్రశ్నించారు. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశంపై సందేహాలను లేవనెత్తారు. శ్మశానవాటికలో దహనానికి మూడు మృతదేహాలు ఉన్నా తమ కుమార్తె మృతదేహాన్ని ముందుగా దహనం చేశారన్నారు.
AP: శ్రీసిటీలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం చేసినట్లు CM చంద్రబాబు చెప్పారు. ‘ఇవాళ ₹1,570 కోట్ల పెట్టుబడితో 15 ప్రాజెక్టులను ప్రారంభించా. ₹900 కోట్ల విలువైన 7 కంపెనీలకు శంకుస్థాపన చేశా. ₹1,213 కోట్ల పెట్టుబడి కోసం 5 సంస్థలు MOUలపై సంతకాలు చేశాయి. 15,280 ఉద్యోగాలు రాబోతున్నాయి. స్వర్ణాంధ్ర-2047 కోసం పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చడానికి కట్టుబడి ఉన్నా’ అని ట్వీట్ చేశారు.
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ‘ట్రామా జెల్’ అనే రక్తస్రావ నిరోధినికి ఆమోదం తెలిపింది. ప్రాణాంతకమైన తుపాకీ, కత్తిపోట్ల వంటి గాయాలపై ఇది క్షణాల్లో పని చేస్తుంది. ఎంతటి తీవ్ర రక్తస్రావాన్నైనా ఈ జెల్ సెకన్లలో కంట్రోల్ చేస్తుంది. రక్తం కారుతున్న చోట ఈ జెల్‌ను సిరంజీతో అప్లై చేయాలి. క్రెసిలాన్స్ అనే బయోటెక్నాలజీ కంపెనీ దీన్ని తయారు చేసింది.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదల ప్రయత్నాలు ఉత్తమమైనవని US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. బహుశా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ – హమాస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఖతార్‌లో ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన చర్చలు యూఎస్ ప్రమేయంతో ఈ వారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
కోల్‌కతా వైద్యురాలిపై <<13867304>>హత్యాచార<<>> నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ టెస్టు(లై డిటెక్షన్) చేసేందుకు సీబీఐకి హైకోర్టు అనుమతిచ్చింది. నిందితుడు విచారణలో రోజుకో మాట చెబుతున్నాడు. దీంతో నిజనిర్ధారణ కోసం పాలీగ్రాఫ్ చేసేందుకు అధికారులు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఓకే చెప్పింది. అలాగే అతనికి సైకో అనాలసిస్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ టెస్టులను CFSL నిపుణులు చేయనున్నారు.
TG: సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న KTR వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రాజీవ్ గాంధీ వల్లే KCR రాజకీయాల్లోకి వచ్చారని VH అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. KTR తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం జోలికొస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ KTRను హెచ్చరించారు.
ముడా స్కాంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని లోకాయుక్తను న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో సీఎంను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
రష్యా – ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి భారత్ మధ్యవర్తిత్వం వహించనుందనే వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. అయితే, తాము రెండుదేశాల మధ్య సందేశాలను చేరవేయడంలో సహకరించగలమని చెప్పింది. ప్రధాని మోదీ ఆగస్టు 23న కీవ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల రష్యా వెళ్లి వచ్చిన ఆయన తాజాగా కీవ్ పర్యటన నేపథ్యంలో మధ్యవర్తిత్వం వార్తలు జోరందుకున్నాయి.
తెలంగాణలోని పలు చోట్ల ఇప్పటికే వర్షం కురవగా రానున్న 3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వాన పడొచ్చని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.