News August 19, 2024
త్వరగా దహనమెందుకు చేశారు?: బాధితురాలి తండ్రి
<<13891437>>కోల్‌కతాలో<<>> హత్యాచారానికి గురైన తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వెంటనే దహనం చేయడాన్ని బాధితురాలి తండ్రి ప్రశ్నించారు. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశంపై సందేహాలను లేవనెత్తారు. శ్మశానవాటికలో దహనానికి మూడు మృతదేహాలు ఉన్నా తమ కుమార్తె మృతదేహాన్ని ముందుగా దహనం చేశారన్నారు.
Similar News
News September 19, 2024
నేను త్వరగా రిటైర్ అయ్యానేమో: ఫెదరర్
తాను త్వరగా రిటైర్ అయిపోయానని తనకు తరచూ అనిపిస్తుంటుందని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడల్లా తాను ఇంకా ఆడగలనని అనుకుంటానని పేర్కొన్నారు. ‘నాలో ఇంకా ఆట ఉంది. కానీ ఇంట్లో ఉండటం సౌకర్యంగా ఉంది. టూర్లు తిరగనవసరం లేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు రిలీఫ్‌గా ఉంటుంది’ అని వెల్లడించారు. తన తోటి దిగ్గజం నాదల్ రిటైర్మెంట్‌పై అంచనా వేయలేనని స్పష్టం చేశారు.
News September 19, 2024
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD అదనపు ఈవో
AP: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించే గరుడ వాహన సేవ ఏర్పాట్లపై TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. ఆ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయం(OCT 4-12)లో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. OCT 7న ఉ.6 గంటల నుంచి కొండపైకి బైకుల్ని నిలిపివేస్తామని, తిరిగి 9వ తేదీన ఉ.6 గం.కు అనుమతిస్తామన్నారు.
News September 18, 2024
తక్కువసేపు నిద్ర పోతున్నారా?
ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాం. తక్కువసేపు నిద్రపోతే మానసిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి క్షీణించటం, ఏకాగ్రత కోల్పోవడం, బరువు పెరగడం, కోపం ముంచుకురావడం, నిరుత్సాహం ఆవరించడం, పనితీరు తగ్గడం, డ్రైవింగ్‌లో ప్రమాదాలకు గురికావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం, ఒత్తిడి పెరగడం, గుండె సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు.