India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒక కర్ణాటక CM అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2010లో అప్పటి BJP CM యడియూరప్ప అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు గవర్నర్ HR భరద్వాజ్ విచారణకు ఆమోదించారు. యడ్డీ రాజీనామాకు అప్పటి ప్రతిపక్ష నేత సిద్ద రామయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ CM సిద్ద రామయ్యకు భూకుంభకోణం ఆరోపణలతో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ విచారణకు అనుమతిచ్చారు.
సొంత గడ్డపై వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగియగా, సెకండ్ టెస్టులో 40 పరుగుల తేడాతో ప్రొటీస్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144కు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 246 రన్స్ చేసి, మొత్తంగా 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే కరీబియన్ జట్టు 222 స్కోరుకే ఆలౌట్ అయ్యింది.
AP: భర్తను చితక్కొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. జీవనోపాధి కోసం వచ్చి రామకోటిలో ఉంటున్న ఈ జంటకు జులాయిగా తిరిగే ఈ యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి మహిళ భర్తతో కలిసి మద్యం సేవించిన ఉన్మాదులు అతడిపై దాడి చేసి, భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం 252 కోట్ల బ్యాంకు ఖాతాలుండగా, అందులో 91.77 కోట్లు(36.4%) మహిళలవని NSO వెల్లడించింది. డిపాజిట్ల మొత్తం రూ.187 లక్షల కోట్లు కాగా మగువల వాటా కేవలం రూ.39 లక్షల కోట్లు(20.8%) అని తెలిపింది. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామీణ స్త్రీల డిపాజిట్లే అధికమంది. అలాగే బ్యాంకుల్లో 13.2 లక్షల మంది పురుషులు పని చేస్తుండగా, మహిళా ఉద్యోగులు 4.41 లక్షలేనని పేర్కొంది.
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఫౌల్స్ వేయడంపై పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఝఝారియా స్పందించారు. ‘పాక్ అథ్లెట్ నదీమ్ వేసిన 92.97M త్రోను ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశంతో నీరజ్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. అప్పటికే 89Mతో తాను రెండో స్థానంలో ఉండటంతో ఫౌల్స్ గురించి పట్టించుకోలేదు. ఈక్రమంలోనే ఫౌల్స్ అయ్యాయి’ అని ఝఝారియా చెప్పారు.
TG: 3వ విడతలోనూ తమకు రుణమాఫీ కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల రైతులు నిరసనకు దిగారు. ADBలో CM దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. కర్మకాండ కుండలతో మహారాష్ట్ర బ్యాంకులోకి వెళ్లి CM డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. KMNRలోని కొత్తపల్లి మండలంలో ఇండియన్ బ్యాంక్‌ను రైతులు మూసేశారు.
TG: ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని TGNPDCL వెల్లడించింది. మొన్న TGSPDCL పరిధిలో ఈ సౌకర్యం రాగా.. తాజాగా NPDCL పరిధిలోనూ అందుబాటులోకి వచ్చింది. భారత్ బిల్‌పేలో చేరకపోవడంతో RBI ఆదేశాలతో ఈ సంస్థలు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని జులై 1న నిలిపివేశాయి. తాజాగా భారత్ బిల్‌పేలో చేరడంతో గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులు UPI యాప్‌లలో నేరుగా చెల్లించవచ్చు.
TG: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ పాపన్న జయంతి సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై బహుజన పోరాటయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం గతంలో తమ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.
TG: సుంకిశాల పంపు హౌస్ వ్యవహారంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. HYDకు తాగునీరిచ్చేందుకు నిర్మిస్తోన్న సుంకిశాల ప్రాజెక్టు ఇటీవల మునిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు అధికారులపై వేటు వేసింది.
TG: 100% రైతులకు రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని BJLP నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ కాలేదని తేలితే CM రేవంత్ రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై రైతుల సమక్షంలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేశారని ఆయన విమర్శించారు. రూ.49వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17వేల కోట్లిచ్చారని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.