India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ఆర్థిక వృద్ధి ఆశించిన దానికంటే మెరుగ్గా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ ఎండీ డా. గీతా గోపీనాథ్ అన్నారు. 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్ఎంసీజీ, ద్విచక్రవాహనాల మెరుగైన అమ్మకాలు సహా అనుకూలమైన రుతుపవనాల కారణంగా 2024-25 ఏడాదికి గానూ భారత వృద్ధి రేటును ఐఎంఎఫ్ 7 శాతానికి పెంచింది.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో నిజం బయటకు రావాలని సీఎం మమత అన్నారు. అయితే, ఈ విషయంలో కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసంతో విద్యార్థి సంఘాలకు సంబంధం లేదని, ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందన్నారు. జెండాలు చేతపట్టుకొని బీజేపీ, DYFIకి చెందిన వారే ఈ విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. 25 మందిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు.
ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ స్క్వేర్‌లో జరుగుతోన్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి టిమ్ వాట్స్ చరణ్‌తో సెల్ఫీ దిగి ‘నాటు నాటు.. రామ్ చరణ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా, అభిమానులు సైతం భారీగా తరలిరావడంతో వారితో చెర్రీ సెల్ఫీ తీసుకున్నారు.
TG: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ విషప్రచారం చేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అవన్నీ ఊహజనిత వ్యాఖ్యలని కొట్టిపారేశారు. బీజేపీలో అలాంటి చర్చ ఏమీ లేదని, ఫేక్ ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.
ప్రపంచ మార్కెట్లలో వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లలో శుక్రవారం బుల్ జోరు కొనసాగింది. అన్ని కౌంటర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ దాదాపు 1330 పాయింట్ల లాభాలతో 80,436, నిఫ్టీ 400 పాయింట్ల లాభాలతో 24,541 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ రూ.451 లక్షల కోట్లకు చేరింది.
మూఢాలు పోయాయ్. ముహూర్తాలు వచ్చాయ్. మూడు నెలలుగా వేచి ఉన్నవారంతా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. Aug 22, 23, 24 తేదీల్లో ఉక్కిరిబిక్కిరి చేసేలా పెళ్లిళ్లున్నాయి. ఫ్రెండ్ పెళ్లి, చుట్టాలది, తెలిసిన వారిది, కొలీగ్ పెళ్లి అన్ని ఒకేసారి వచ్చాయి. అన్ని వైపుల నుంచి ‘పెళ్లికి రాకపోతే బాగోదు’ అని వార్నింగ్ టైప్ ఇన్విటేషన్ల మధ్య ఏ పెళ్లికి వెళ్లాలనే అయోమయం నెలకొంది. మరి మీకెన్ని ఇన్విటేషన్లు వచ్చాయి?
AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు. ఆ రోజు తాను కేవలం నిరసన తెలిపేందుకే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని చెప్పారు. ఈ ఘటన సమయంలో వినియోగించిన కారు, ఫోన్‌ను ఆయన తీసుకొచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘కేసులకు భయపడను. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను. చంద్రబాబు, లోకేశ్ హామీలకు బదులు రెడ్‌బుక్ అమలు చేస్తున్నారు’ అని ఆగ్రహించారు.
TG: రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
నేషనల్ అవార్డ్స్‌లో సత్తాచాటిన రిషబ్ శెట్టి, యష్, టాలీవుడ్ హీరో నిఖిల్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ‘కాంతారలో మీ నటనకు ఈ అవార్డుకు అర్హులు. మీ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ నాకు గూస్‌బంప్స్ ఇస్తోంది’ అని రిషబ్ నటనను కొనియాడారు. అలాగే, దేశవ్యాప్తంగా జాతీయ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. ‘థ్యాంక్యూ సార్’ అంటూ రిషబ్ రిప్లై ఇచ్చారు.
AP: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. మూడేళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
Sorry, no posts matched your criteria.